- Telugu News Photo Gallery Cinema photos Small films of 2023 which were boxoffice hits like Baby, Dasara, Virupaksha
బాక్సాఫీస్ దగ్గర చిన్న హీరోలు ధూమ్ ధామ్.. 2023లో టాప్ చిత్రాలు ఇవే..
సినిమాలన్నీ వెయ్యి కోట్లను టార్గెట్ చేస్తున్న ఈ టైమ్‌లో, సడన్ సర్‌ప్రైజ్‌లు ఇచ్చిన సినిమాలు 2023లో కొన్ని వచ్చాయి. అలా ఈ ఏడాదిలో మళ్లీ మళ్లీ మెప్పించిన మీడియం రేంజ్ హీరోల సినిమాల గురించి ఓ సారి ఫోకస్ చేద్దాం. నాని హీరోగా నటించిన దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ధూమ్ ధామ్ చేసింది. నాని అంతకు ముందెప్పుడూ కనిపించనంత మాస్‌గా కనిపించారు దసరాలో. ఇయర్ ఎండింగ్‌లో హాయ్ నాన్నతోనూ మెప్పించారు నాని.
Updated on: Dec 15, 2023 | 8:07 PM

సినిమాలన్నీ వెయ్యి కోట్లను టార్గెట్ చేస్తున్న ఈ టైమ్‌లో, సడన్ సర్‌ప్రైజ్‌లు ఇచ్చిన సినిమాలు 2023లో కొన్ని వచ్చాయి. అలా ఈ ఏడాదిలో మళ్లీ మళ్లీ మెప్పించిన మీడియం రేంజ్ హీరోల సినిమాల గురించి ఓ సారి ఫోకస్ చేద్దాం.

నాని హీరోగా నటించిన దసరా సినిమా బాక్సాఫీస్ దగ్గర ధూమ్ ధామ్ చేసింది. నాని అంతకు ముందెప్పుడూ కనిపించనంత మాస్‌గా కనిపించారు దసరాలో. ఇయర్ ఎండింగ్‌లో హాయ్ నాన్నతోనూ మెప్పించారు నాని. మధ్యలో విరూపాక్షతో సడన్ హిట్ అందుకున్నారు సాయిధరమ్‌తేజ్. సైలెంట్ హిట్‌గా సర్‌ప్రైజ్ చేసింది సాయితేజ్ విరూపాక్ష

లైగర్ తర్వాత పక్కా హిట్ పడి తీరాల్సిందేనన్న కంపల్సరీ సిట్చువేషన్‌లో ఉన్నారు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన ఖుషి యూత్‌ని అట్రాక్ట్ చేసింది. అలాగే ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా కూడా యువతను మెప్పించింది.

సామ్‌కి ఖుషి పడ్డట్టే, అనుష్కకి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి హిట్ అయింది. ఆచితూచి అడుగులు వేస్తారని పేరు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి అంతా తానై ఈ సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. ఆయన పబ్లిసిటీ జనాల్లోకి వెళ్లింది. దానికి తోడు థీమ్ కూడా మెప్పించబట్టి బంపర్ హిట్ అయింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.

ఈ ఏడాది యునానిమస్‌గా హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా సామజవరగమన. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా శ్రీవిష్ఱు కెరీర్‌లో చాలా మంచి హిట్ అయింది. హెల్దీ కామెడీకి ఎప్పుడూ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారన్న విషయం ఈ మూవీతో మరోసారి ప్రూవ్ అయింది.




