- Telugu News Photo Gallery Cinema photos Will trivikram srinivas do a multi starrer movie with venkatesh and nani
Trivikram Srinivas: ‘మాటల మాంత్రికుడు’ కేరాఫ్ మల్టీస్టారర్.. నాని, వెంకటేష్ చెప్పకనే చెప్పేశారుగా..
ప్రమోషన్ల పుణ్యమా అని ఇంట్రస్టింగ్ విషయాలు చాలానే వినిపిస్తున్నాయి. అందులోనూ ఈ మధ్య నాకేం సంబంధం తలైవా అని త్రివిక్రమ్ ఓపెన్‌గా అనేసేలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. త్రివిక్రమ్‌కి లింకేంటో నాని, వెంకటేష్ చెప్పకనే చెప్పేశారు. ఇంతకీ ఏంటా విషయాలు కమాన్ లెట్స్ వాచ్. సైంధవ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు విక్టరీ వెంకటేష్. లేటెస్ట్ గా సాంగ్ రిలీజ్ కోసం విజయవాడలో యూత్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ వెంకీ మామకు ఎదురైన క్వశ్చన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
Updated on: Dec 15, 2023 | 8:13 PM

ప్రమోషన్ల పుణ్యమా అని ఇంట్రస్టింగ్ విషయాలు చాలానే వినిపిస్తున్నాయి. అందులోనూ ఈ మధ్య నాకేం సంబంధం తలైవా అని త్రివిక్రమ్ ఓపెన్‌గా అనేసేలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. త్రివిక్రమ్‌కి లింకేంటో నాని, వెంకటేష్ చెప్పకనే చెప్పేశారు. ఇంతకీ ఏంటా విషయాలు కమాన్ లెట్స్ వాచ్

సైంధవ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు విక్టరీ వెంకటేష్. లేటెస్ట్ గా సాంగ్ రిలీజ్ కోసం విజయవాడలో యూత్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ వెంకీ మామకు ఎదురైన క్వశ్చన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. నువ్వు నాకు నచ్చావ్ మూవీకి సీక్వెల్ ఎప్పుడు అని వెంకీని ప్రశ్నించారు.

త్రివిక్రమ్‌కి ఫోన్ చేసి కథ రెడీ చేయమని చెప్పండి అని వెంకీ ఫన్నీగా ఆన్సర్ ఇవ్వడంతో అందరి ఫోకస్ ఒక్కసారి త్రివిక్రమ్ మీద పడింది. ఆ సినిమాలో పాటలు, డైలాగులు ఒక్కసారిగా అందరికీ అప్పటి రోజులను గుర్తుచేస్తున్నాయి. నువ్వు నాకు నచ్చావ్ క్లిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి నెట్టింట్లో.

ఇప్పుడు వెంకటేష్ చెప్పినట్టుగానే ఆ మధ్య నాని కూడా త్రివిక్రమ్‌ని మెన్షన్ చేశారు. మహేష్ తో కలిసి మీరు సినిమా చేస్తారా? అని నానికి ఓ క్వశ్చన్ ఎదురైంది. 'ఏం త్రివిక్రమ్‌గారూ వింటున్నారా' అంటూ నాని సరదాగా చెప్పిన ఆన్సర్ ఇన్‌స్టంట్‌గా వైరల్ అయింది. హాయ్ నాన్న ప్రమోషన్ల టైమ్‌లో విపరీతంగా ట్రెండ్ అయింది ఈ న్యూస్

ప్రస్తుతం మహేష్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్. ఇది పూర్తి కాగానే బన్నీతో ఓ సినిమా చేస్తారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా అనగానే, జోనర్ గురించి ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ వాళ్లిద్దరి కాంబోలో ఉన్న హిట్ సినిమాలన్నిటినీ ఒక్కసారిగా గుర్తుచేసుకుంటున్నారు.




