Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saffron for Skin: మెరిసే చర్మం కోసం కుంకుమపువ్వుతో ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేయండి

ఒక గ్రాము కుంకుమపువ్వు కొనాలంటే దాదాపు రూ.500 రూపాయలు వెచ్చించాల్సిందే. నాణ్యమైన కుంకుమపువ్వు ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కుంకుమపువ్వును ఏ ఆహారంలో చేర్చినా దాని రుచి మారుతుంది. ఇక కుంకుమపువ్వు చర్మాన్ని సంరక్షించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా కుంకుమపువ్వు చర్మాన్ని వృద్ధాప్య ఛాయల నుంచి కాపాడుతుంది. కుంకుమపువ్వు చర్మం మచ్చలు, ముడతలు తొలగించడంలో సహాయపడుతుంది. పుల్లటి పెరుగు, తేనెతో కుంకుమపువ్వును మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది..

Srilakshmi C

|

Updated on: Dec 15, 2023 | 9:30 PM

ఒక గ్రాము కుంకుమపువ్వు కొనాలంటే దాదాపు రూ.500 రూపాయలు వెచ్చించాల్సిందే. నాణ్యమైన కుంకుమపువ్వు ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కుంకుమపువ్వును ఏ ఆహారంలో చేర్చినా దాని రుచి మారుతుంది. ఇక కుంకుమపువ్వు చర్మాన్ని సంరక్షించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా కుంకుమపువ్వు చర్మాన్ని వృద్ధాప్య ఛాయల నుంచి కాపాడుతుంది. కుంకుమపువ్వు చర్మం మచ్చలు, ముడతలు తొలగించడంలో సహాయపడుతుంది. పుల్లటి పెరుగు, తేనెతో కుంకుమపువ్వును మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది.

1 / 5
కుంకుమపువ్వులో క్రోసిన్, క్రోసెటిన్ అనే రెండు సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్ సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. కుంకుమపువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఇది మొటిమలను కలిగించే బ్యాక్టీరియా, జెర్మ్స్‌తో పోరాడుతుంది. మొటిమల సమస్యతో బాధపడేవారు కుంకుమపువ్వు వినియోగిస్తే మచ్చలేని అందం చేసుకోవచ్చు.

2 / 5
వంట చేసేటప్పుడు చేతులు కాలినా లేక ఎండ వేడిమికి చర్మం కమిలిపోయినట్లు అయినా కుంకుమపువ్వు ఉపశమనం కలిగిస్తుంది. కుంకుమపువ్వులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గాయం నయం చేయడంలో, కొత్త కణాల నిర్మాణంలో సహాయపడుతుంది.

3 / 5
కుంకుమపువ్వును కళ్ల చుట్టూ రాసుకుంటే ఉబ్బరం, నల్లటి వలయాలు పోతాయి. కుంకుమపువ్వు రంధ్రాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సహాయపడుతుంది. కుంకుమపువ్వు సహజమైన స్కిన్ టోనర్‌గా పనిచేస్తుంది.

4 / 5
కుంకుమపువ్వును పాలలో నానబెట్టి, కొంచెం తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా ముఖానికి అప్లై చేయాలి. వారానికోసారి కుంకుమపువ్వుతో ఇలా ప్యాక్‌ వేసుకుంటే ముఖం కాంతివంతం అవుతుంది.

5 / 5
Follow us