Nellore District: వందలాది పావురాళ్లను ఎగరేసేందుకు రంగం సిద్ధం.. అంతలోనే ఆటకట్టు
Pigeon Betting: ఏపీలో కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు జరగడం కామన్. కానీ ఇప్పుడు కొత్త పందాలు తెరపైకి వచ్చాయి. అదేంటి? ఎవరు నిర్వహించారు?
Pigeon Race: ఇక ఇప్పటివరకు ప్రకాశం జిల్లా(prakasam district)లో జరిగిన ఈ పావురాల పందేలు..పక్కనే నెల్లూరు జిల్లాకు పాకాయి. నాయుడుపేట(Naidupeta)లో పీజియోన్స్ ఫైట్‌కు అంతా రెడీ అయింది. వందలాది పావురాళ్లను ఎగరేసేందుకు రంగం సిద్ధమైంది. కానీ అంతలోనే ఎంట్రీ ఇచ్చారు పోలీసులు. నాయుడుపేట నుంచి చెన్నైకి పావురాల పందేలకు సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు. చెన్నై(Chennai)కి చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ(Andhra Pradesh)లో వరుసగా ఈ పావురాల పందేలు నిర్వహిస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ శివార్లలో ఒక్కసారిగా వందలాది పావురాలు గాల్లోకి ఎగిరాయి. ఏమైందోనని ఆందోళన చెందారు ప్రజలు. చాలామంది గ్రామ శివారుకు వచ్చి అక్కడ జరుగుతున్న దృశ్యాలను అవాక్కయారు. అక్కడ చెన్నై నుంచి వచ్చి పావురాల పందాలు నిర్వహించారు పందెం రాయుళ్లు. పావురాల బెట్టింగ్‌తో హల్‌చల్ చేశారు. ఈ పీజియన్ రేస్ కోసం చెన్నై నుంచి 4 లారీలలో ప్రత్యేక కేజ్‌ల్లో పావురాల్ని తీసుకువచ్చారు నిర్వాహకులు. చిన్న కొత్తపల్లి వద్ద ఆ పావురాలని వదిలిపెట్టారు. ఏ పావురం ముందుగా చెన్నై చేరితే అదే విజేతగా నిలుస్తుందని అంటున్నారు. ఆ పావురం యజమానికి బహుమతి ఇవ్వనుంది విండో పీజియన్. ఈ విండో పీజియన్ సంస్థ ఆధ్వర్యంలోనే రేస్‌కు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అయితే చెన్నై నుంచి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఎందుకు ఇలా వదిలేస్తున్నారని వారిని ప్రశ్నించారు స్థానికులు. దీంతో అక్కడి నుంచి పరారయ్యారు నిర్వాహకులు.
అటు ఈ పందాల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ జరుపుతారనే చర్చ కూడా జరుగుతోంది. అద్దంకి ప్రాంతం నుంచి చెన్నెకి ముందుగా ఏ నెంబరు ట్యాగ్ ఉన్న పావురం చేరుకుంటే, ఆ పావురం నెంబర్‌ను ఎంచుకున్న వ్యక్తి బెట్టింగ్‌లో గెలిచినట్లని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అద్దంకి పోలీసులు, 4 లారీలను, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, సహాయకులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. వివిధ సంస్థలకు చెందిన పావురాలను పందెం కోసం తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు పోలీసులు. అయితే, పావురాలను ఎగరేసేందుకు అనుమతి ఉందని చెబుతున్నారు నిర్వాహకులు. ఇది బెట్టింగా? శిక్షణా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. అద్దంకి పరిసర ప్రాంతాల్లో పావురాలను ఎగరేసేందుకు రావడం 10 రోజుల వ్యవధిలో ఇది రెండో సారి.
Also Read: Andhra Pradesh: టమాటా లోడ్ అనుకుంటే పొరబడినట్లే.. లోపల చెక్ చేస్తే కళ్లు చెదిరాయి
గుంటూరు జిల్లా నుంచి మిర్చిలాంటి ప్లేయర్.. అండర్-19 వరల్డ్ కప్ విజయంలో కీ రోల్..