COUPLE SUICIDE: ఫ్యాన్ కు ఉరేసుకుని భార్య ఆత్మహత్య.. తట్టుకోలేని భర్త ఏం చేశాడంటే..?
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం విశిష్టమైనది. సంసార జీవితంలో గొడవలు, అలకలు సర్వసాధారణం. కానీ ప్రకాశం జిల్లా ఒంగోలులో చిన్నచిన్న మనస్పర్థలే నవ దంపతుల మృతికి కారణమయ్యాయి.
దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం విశిష్టమైనది. సంసార జీవితంలో గొడవలు, అలకలు సర్వసాధారణం. కానీ ప్రకాశం జిల్లా ఒంగోలులో చిన్నచిన్న మనస్పర్థలే నవ దంపతుల మృతికి కారణమయ్యాయి. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన వారు నలభై రోజుల్లోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. ఫ్యాన్ కు ఉరేసుకుని భార్య ఆత్మహత్య(Suicide) చేసుకోగా… భార్య లేని జీవితం తనకు వద్దని భర్త గుండ్లకమ్మ జలాశయంలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన పొదిలి శ్రీమన్నారాయణ, రమణమ్మ దంపతుల కుమారుడు మహానంది(30). ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాయ్‌లో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా మహానంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన ప్రియాంకతో గతేడాది డిసెంబర్ 28న వివాహమైంది. ఇటీవల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రకటన విడుదల అయింది. దీంతో పరీక్షలకు సిద్ధం కావాలని మహానంది భార్యను కోరారు. ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదని ప్రియాంక తెలపడంతో ఇరువురి మధ్య పలుమార్లు సంభాషణ సాగిందని వీరి తల్లిదండ్రులు తెలిపారు. ఇలా ఉండగా ఈ నెల నాలుగో తేదీన ప్రియాంక తన పుట్టింట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మహానంది.. హుటాహుటిన ఒంగోలు వచ్చారు.
భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేనని, ఇకపై మీ దగ్గరకి రానని మహానంది చెప్పినట్లు అతని తల్లితండ్రులు చెప్పారు. అనంతరం ఉదయం 5 గంటలకు గుండ్లకమ్మ జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఒంగోలు, అద్దంకి అగ్నిమాపక సిబ్బంది జలాశయం వద్దకు చేరుకుని బోట్ల సహాయంతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం సమయంలో మహానంది మృతదేహం లభ్యమైంది. రెండు రోజుల వ్యవధిలోనే నవ దంపతులు బలవన్మరణాలకు పాల్పడటంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Also Read
Crime News: వనపర్తి జిల్లాలో దారుణం.. ముగ్గురు పిల్లలతో కాలువలో దూకిన తల్లి..
Road Accident: పెళ్లికి హాజరై వస్తుండగా.. పేలిన కారు టైర్లు.. ఇద్దరు దుర్మరణం
Gadwal Bidda: సోషల్ మీడియా సంచలనం.. గద్వాల్ రెడ్డి బిడ్డ మృతి.. అనారోగ్యంతో..