AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: వనపర్తి జిల్లాలో దారుణం.. ముగ్గురు పిల్లలతో కాలువలో దూకిన తల్లి..

Crime News: వనపర్తి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ గొడవల వల్ల ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల ప్రధాన కాలువలో దూకింది.

Crime News: వనపర్తి జిల్లాలో దారుణం.. ముగ్గురు పిల్లలతో కాలువలో దూకిన తల్లి..
Vanaparthi
uppula Raju
|

Updated on: Feb 07, 2022 | 6:10 AM

Share

Crime News: వనపర్తి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కుటుంబ గొడవల వల్ల ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి జూరాల ప్రధాన కాలువలో దూకింది. ఇందులో ముగ్గురు గల్లంతు కాగా ఒక బాలుడిని స్థానిక యువకుడు రక్షించాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెబ్బేరు పట్టణానికి చెందిన తెలుగు స్వామి, భవ్య అనే యువతి పదేళ్ల కిందట ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకొన్నారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే కొన్ని రోజులుగా భార్య భర్తల మధ్య మనస్పర్దలు రావడంతో గొడవలు జరుగుతున్నాయి.

ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన భవ్య రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురు పిల్లలను తీసుకొని పట్టణ సమీపంలో ఉన్న జూరాల ఎడమ ప్రధాన కాలువలో దూకింది. అయితే అటుగా వెళుతున్న కుమార్‌ అనే యువకుడు గమనించి మూడేళ్ల బాలుడిని రక్షించాడు. కానీ తల్లితో సహా మరో ఇద్దరు పిల్లలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికులు సమాచారం అందించగా పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఏం జరిగిందో విచారణ చేపట్టారు. వెంటనే రామన్‌పాడు జలాశయం అధికారులతో మాట్లాడి నీటి విడుదలని ఆపారు. ఉదయం గాలింపు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.

చాణక్య నీతి: ఈ నాలుగు చెడ్డ అలవాట్ల వల్ల ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడే మార్చుకోండి..?

Green Tea Side Effects: పరగడుపున గ్రీన్‌ టీ తాగే అలవాటు ఉందా.. చాలా దుష్ప్రభావాలు..?

Jio, Airtel, Vi: జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ రీఛార్జ్ ప్లాన్‌లు.. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు..