చాణక్య నీతి: ఈ నాలుగు చెడ్డ అలవాట్ల వల్ల ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడే మార్చుకోండి..?

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు గొప్ప జీవిత కోచ్‌గా పేరుగాంచాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా

చాణక్య నీతి: ఈ నాలుగు చెడ్డ అలవాట్ల వల్ల ఆర్థిక సంక్షోభం.. ఇప్పుడే మార్చుకోండి..?
వేశ్య కూడా ఇతరుల బాధలను అర్థం చేసుకుంటుందని ఆశించడం అవివేకం. వేశ్య తన పని గురించి మాత్రమే పట్టించుకుంటుంది ఆమె మీ గురించి ఏమీ పట్టించుకోదు.
Follow us

|

Updated on: Feb 07, 2022 | 9:33 AM

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు గొప్ప జీవిత కోచ్‌గా పేరుగాంచాడు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నంద వంశం నాశనమైంది. చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాల గురించి కూడా ప్రస్తావించాడు. చెడ్డ అలవాట్ల వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించాడు. ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే అలవాట్లను మానుకోవాలని చెప్పాడు. వాటి గురించి తెలుసుకుందాం.

1. అసమాన ఖర్చులు

చాణక్యుడి ప్రకారం అందరు ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయాలి. తరచుగా ప్రజలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తారు. ఈ అలవాటు వల్ల ఒక్కోసారి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆచార్య చాణక్యుడు డబ్బు పొదుపు చేయాలని చెబుతాడు. ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుందని సూచించాడు.

2. డబ్బు వృధా చేయకండి

చాణక్య నీతి ప్రకారం సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి చంచల స్వభావం కలది. ఎప్పుడూ ఒకే చోట నిలవదు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ధనం లభించినట్లయితే ఆ డబ్బు వృధా చేయకూడదు. తప్పుగా ఉపయోగిస్తే దాని ఉనికి అంతం అవుతుందని చెప్పాడు.

3. ఆర్థిక సంక్షోభం

చాలా సార్లు ప్రజలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు వారు తమ సమస్యలను ఇతరులతో షేర్ చేసుకుంటారు. అయితే ఆర్థిక సమస్యలని జీవిత భాగస్వామితో తప్ప వేరే వారితో పంచుకోకూడదని ఆచార్య చాణక్య చెబుతున్నాడు. ఎందుకంటే ఇతరులతో సమస్యల గురించి చర్చించడం వల్ల ఆర్థిక సంక్షోభం మరింత పెరుగుతుందని, తెలివైన వ్యక్తి ఎప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని రహస్యంగా ఉంచుతాడని సూచించాడు.

4. ఆలస్యంగా నిద్ర లేవడం

చాలా మందికి ఉదయం లేటుగా లేవడం అలవాటు. ఆచార్య చాణక్య ప్రకారం.. ఆలస్యంగా లేవడం ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఎక్కువ సేపు పడుకోవడం వల్ల దరిద్రం తాండవిస్తుంది. రోజంతా ఏదో ఒక కారణం వల్ల మనసు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి త్వరగా లేవడానికి ప్రయత్నించాలని చెప్పాడు. ప్రతిరోజూ సాధ్యం కాకపోతే కనీసం వారానికి మూడుసార్లయినా ఉదయమే లేవడానికి ప్రయత్నిస్తే మంచిదని చెప్పాడు.

Green Tea Side Effects: పరగడుపున గ్రీన్‌ టీ తాగే అలవాటు ఉందా.. చాలా దుష్ప్రభావాలు..?

Jio, Airtel, Vi: జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ రీఛార్జ్ ప్లాన్‌లు.. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు..

Papaya Side Effects: ఈ వ్యాధులతో బాధపడేవారు బొప్పాయి తినకూడదు.. చాలా దుష్ప్రభావాలు..?

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!