Green Tea Side Effects: పరగడుపున గ్రీన్ టీ తాగే అలవాటు ఉందా.. చాలా దుష్ప్రభావాలు..?
Green Tea Side Effects: కరోనా వచ్చినప్పటి నుంచి గ్రీన్ టీ అందరు తాగుతున్నారు. బరువు తగ్గించుకునే వ్యక్తులు కూడా గ్రీన్ టీపై ఆధారపడుతున్నారు.
Green Tea Side Effects: కరోనా వచ్చినప్పటి నుంచి గ్రీన్ టీ అందరు తాగుతున్నారు. బరువు తగ్గించుకునే వ్యక్తులు కూడా గ్రీన్ టీపై ఆధారపడుతున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అయితే గ్రీన్ టీని సరిగ్గా తీసుకోకపోతే అది శరీరానికి హానికరంగా మారుతుంది. చాలా మందికి ఉదయాన్నే పరగడుపున గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది చాలా అనారోగ్యాలకు దారి తీస్తుంది. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
1. ఆకలి నష్టం
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పరగడుపున గ్రీన్ తాగడమే కాకుండా రోజులో ఎక్కువసార్లు తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల కడుపులో మంట వస్తుంది. బాధిత వ్యక్తికి ఏమీ తినాలని అనిపించదు. అంతే కాదు ఈ యాసిడ్ వల్ల కడుపు నొప్పి మొదలవుతుంది.
2. ఐరన్ లోపం
గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. నిజానికి గ్రీన్ టీలో ఉండే టానిన్లు ఐరన్‌ని గ్రహిస్తాయి. గర్భిణులకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది. గర్భంలో ఉండే బేబీకి, అంతేకాకుండా బిడ్డ పుట్టిన తర్వాత కూడా హాని ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావానికి కూడా కారణం కావచ్చు.
3. డీ హైడ్రేషన్
కాఫీ వంటి గ్రీన్ టీలో కెఫీన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ పరగడుపున తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. రోజులో ఏదైనా ఇతర సమయంలో గ్రీన్ టీ తాగాలనుకుంటే ముందుగా ఎక్కువ నీరు తాగాల్సిఉంటుంది.
4. తలనొప్పి
గ్రీన్ టీని పరగడుపున తాగడం వల్ల చాలా మందికి తలనొప్పి మొదలవుతుంది. కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అల్పాహారం తీసుకున్న కొద్దిసేపటికే గ్రీన్ టీని తీసుకుంటే మంచిది.