AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WILD ANIMALS : వన్యప్రాణుల మనుగడకు పెను ప్రమాదం.. జనావాసాల్లోకి చిరుతలు, పులులు

మనిషి తన స్వార్ధ ప్రయోజనాల కోసం అడవులను ధ్వంసం చేస్తున్నాడు. చెట్టూ, చేమ, మన్ను, మిన్ను, గాలి వంటి వాటినీ నాశనం చేస్తూ విధ్యంసం సృష్టిస్తున్నాడు. దీంతో కాలాలు గతి తప్పుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి వంటి కరవు కాటకాలు సంభవిస్తున్నాయి. ..

WILD ANIMALS : వన్యప్రాణుల మనుగడకు పెను ప్రమాదం.. జనావాసాల్లోకి చిరుతలు, పులులు
Wild Animals
Ganesh Mudavath
|

Updated on: Feb 07, 2022 | 8:16 AM

Share

మనిషి తన స్వార్ధ ప్రయోజనాల కోసం అడవులను ధ్వంసం చేస్తున్నాడు. చెట్టూ, చేమ, మన్ను, మిన్ను, గాలి వంటి వాటినీ నాశనం చేస్తూ విధ్యంసం సృష్టిస్తున్నాడు. దీంతో కాలాలు గతి తప్పుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి వంటి కరవు కాటకాలు సంభవిస్తున్నాయి.  ఒకప్పుడు భూ విస్తీర్ణంలో డెబ్భై శాతంతో కళకళలాడిన అడవులు(Forest) నేడు 23 శాతానికే పరిమితమయ్యాయి. ఫలితంగా వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లింది. అడవిలో ఉండేందుకు చోటు చాలక జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలాంటి చర్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అటవీ(Nallamala Forest) ప్రాంత పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తరచూ ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం ఉంటే.. అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రకృతి ప్రేమికులు, అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.

కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌తో పాటు రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యాలు ఉన్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం 55 జాతుల క్షీరదాలు, 200 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 54 రకాల సరీసృపాలు, 55 జాతుల చేపలు ఈ అడవిలో జీవిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో బయోడైవర్సిటీ ఏర్పాటయ్యాక నల్లమల అటవీ ప్రాంతంలో కొన్ని కొత్త రకం జీవరాశులను కనుగొన్నారు. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట నల్లమల అడవిలో ఉంది. ఇక్కడ 30 వేల మంది నివాసం ఉంటున్నారు. అటవీ ప్రాంతం కావడంతో గ్రామంలోకి తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు వస్తుంటాయి. అలాగే అహోబిలం, మహానంది, సర్వనరసింహస్వామి, రుద్రకోడు పుణ్యక్షేత్రాలూ నల్లమల అడవిలోనే ఉన్నాయి. ఇక్కడ భక్తులకు తరచూ వన్యప్రాణులు కనిపిస్తుంటాయి.

తమ ప్రాణాలకు హాని జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చే వరకు పులి, చిరుతలు, ఎలుగుబంట్లు మనిషిపై దాడి చేయవు. చిరుతలు మనుషుల ఆవాసాలకు సమీపంలోనే తమ ఆహారాన్ని వెతుక్కుంటాయి. ఇవి గ్రామ సమీపాల్లో రాత్రి పూట రహస్యంగా తిరుగుతూ తనకిష్టమైన కుక్కలను ఎత్తుకు పోతాయి. అటవీ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో వంగి నడవడం, కూర్చోవడం చేయకాడదు. అడవిలో నడిచే సమయంలో చేతిలో కర్ర ఉంచుకోవడం మంచిది. అటవీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారు పెద్ద పెద్ద శబ్దాలు చేయకుండా పరిసరాలను ప్రశాంతంగా ఉంచాలి. వాతావరణ కాలుష్యానికి పాల్పడకుండా ఉండాలి. అటవీ నిబంధనలను తప్పకుండా పాటించాలి. వన్యప్రాణుల సంచారం కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలి.

Also Read

Nellore District: వందలాది పావురాళ్లను ఎగరేసేందుకు రంగం సిద్ధం.. అంతలోనే ఆటకట్టు

Sumanth: విడాకుల కథ అనగానే ఓకే చెప్పేశాను.. మళ్లీ మొదలైంది సినిమాపై సుమంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Google Chrome: ఎనిమిదేళ్ల తర్వాత లోగోను మార్చేసిన గూగుల్.. ఫన్నీ కామెంట్స్ చేస్తోన్న నెటిజన్లు..