Sumanth: విడాకుల కథ అనగానే ఓకే చెప్పేశాను.. మళ్లీ మొదలైంది సినిమాపై సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sumanth: 'మళ్లీ రావా' సినిమాతో సుమంత్ మంచి ఫీల్ గుడ్ హిట్‌ను అందుకున్నారు. అందమైన ప్రేమ కథను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. చాలా రోజుల తర్వాత సుమంత్‌కు మంచి విజయాన్ని అందించిందీ చిత్రం. అయితే ఈ సినిమా..
Sumanth: ‘మళ్లీ రావా’ సినిమాతో సుమంత్ మంచి ఫీల్ గుడ్ హిట్‌ను అందుకున్నారు. అందమైన ప్రేమ కథను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. చాలా రోజుల తర్వాత సుమంత్‌కు మంచి విజయాన్ని అందించిందీ చిత్రం. అయితే ఈ సినిమా తర్వాత సుబ్రమణ్యపురం, ఇదం జగత్, కపటదారి వంటి యాక్షన్ చిత్రాలతో వచ్చిన సుమంత్ ఇప్పుడు మరో డీసెంట్ మూవీతో వస్తున్నారు. అదే.. మళ్లీ మొదలైంది. ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇదిలా ఉంటే మొదట ఈ సినిమాను థియేటరల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా తదనంతర కారణాల వల్ల ఓటీటీలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 11న ఈ సినిమా నేరుగా జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న క్రమంలో ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్.. తాజాగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగానే సుమంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మొదలైంది సినిమా విడాకుల కథాంశంతో ఉంటుందని చెప్పగానే ఓకే చెప్పేశానని తెలిపారు. కథ చెబుతోన్న సమయంలో ఈ సినిమా విడాకుల కాన్సెప్ట్‌తో ఉండనుందని తెలపడంతో వెంటనే చేయాలని డిసైడ్ అయ్యాను అన్నారు. ఇలాంటి కథను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని అనుకున్నానని సుమంత్ చెప్పుకొచ్చారు.
మరి మరోసారి వైవిధ్యమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుమంత్ ఏమేర ప్రేక్షకులను ఆకట్టుకుంటారో తెలియాలంటే 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో వర్షిణి, నైనా గంగూలీ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు.
Also Read: Silver Rate Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన సిల్వర్ రేట్లు..
Anantapur Accident: పెళ్లింట చావు మేళం.. ఇంటికి వస్తుండగా కబళించిన మృత్యువు.. 9 మంది మృతి