Nivetha pethuraj: డిజిటల్ ఎంట్రీకి సిద్దమైన టాలెంటెడ్ బ్యూటీ.. ఆహాలో నివేదా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’..ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Feb 08, 2022 | 6:42 AM

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ఇస్తూ డిజిటల్ ప్లాట్ ఫాం రంగంలో దూసుకుపోతుంది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా (Aha). రోజు రోజుకీ గ‌ణ‌నీయంగా

Nivetha pethuraj: డిజిటల్ ఎంట్రీకి సిద్దమైన టాలెంటెడ్ బ్యూటీ.. ఆహాలో నివేదా పేతురాజ్ 'బ్లడీ మేరీ'..ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్..
Bloody Mary

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ఇస్తూ డిజిటల్ ప్లాట్ ఫాం రంగంలో దూసుకుపోతుంది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా (Aha). రోజు రోజుకీ గ‌ణ‌నీయంగా త‌న ప్రభావాన్ని పెంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మనసులలో సుస్థిర‌మైన స్థానాన్ని ద‌క్కించుకుంది. కంటెంట్ ప్రాధాన్యత కోరుకునే ఆడియన్స్‏కు 100% ఎంటైర్‌టైన్మెంట్‌ను అందిస్తామ‌నే మాట‌ను నిల‌బెట్టుకుంటూ సూపర్ హిట్ చిత్రాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అందిస్తూ సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆహాలో ఇప్పుడు సీట్ ఎడ్జ్ స‌స్పెన్స్ థ్రిల్లర్ వెబ్ ఒరిజిల్ ‘బ్లడీ మేరి’ (Bloody Mary) ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నివేదా పేతురాజ్ ఈ వెబ్ సిరీస్‏లో నటిస్తోంది. ఈ సిరీస్‏తో నివేదా పేతురాజ్ తెలుగు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ ద‌ర్శకుడు చందు మొండేటి డిజిట‌ల్ మాధ్యమంలో తెర‌కెక్కించిన తొలి ఒరిజిన‌ల్ ఇది. ఈ వెబ్ ఒరిజిన‌ల్ నుంచి నివేదా పేతురాజ్ పాత్రను రివీల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే ఇందులో నివేదా లుక్ భ‌య‌పెట్టేలా ఇన్‌టెన్స్‌తో ఉంది. ‘ఇఫ్ యువార్ బ్యాడ్, షి ఈజ్ బ్లడీ బ్యాడ్’ అనేది ట్యాగ్ లైన్‌. వైక‌ల్యంతో ఇబ్బంది ప‌డుతున్నప్పటికీ త‌న స‌మ‌స్యల‌ను ధైర్యంగా ఎదుర్కొన‌గ‌లిగే అమ్మాయిగా ఇందులో నివేదా న‌టించారు. ఆమెను ప్రేమించిన వారి కోసం ఎంత‌టి స‌మ‌స్యనైనా ఎదుర్కొన‌గ‌లిగే అమ్మాయే మేరి. కిరిటీ దామ‌రాజు, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, బ్రహ్మాజీ, అజ‌య్ కీల‌క పాత్రల్లో న‌టించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు కార్తికేయ వంటి థ్రిల్లర్ జోన‌ర్‌తో ప్రేక్షకుల‌ను మెప్పించిన ద‌ర్శకుడు చందు మొండేటి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. కార్తీక్ ఘ‌ట్టమ‌నేని సినిమాటోగ్రాఫ‌ర్‌. కాల భైర‌వ సంగీతాన్ని అందించారు. త్వరలోనే బ్లడీ మేరి ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

అర్జున ఫ‌ల్గుణ‌, హే జూడ్‌, ది అమెరిక‌న్ డ్రీమ్‌, ల‌క్ష్య, సేనాప‌తి, త్రీ రోజెస్‌, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, అనుభ‌వించు రాజా, స‌ర్కార్‌, ఛెఫ్ మంత్ర‌, అల్లుడుగారు, క్రిస్‌మ‌స్ తాత వంటివ‌న్నీ ప్ర‌స్తుతం ఆహాలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న‌వే. శ్రీరామ్‌చంద్ర హోస్ట్ చేస్తున్న ఫ‌స్ట్ ఎవ‌ర్ సౌత్ ఇండియాస్ ఇండియ‌న్ ఐడ‌ల్‌… అదే మ‌న తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ త్వ‌ర‌లోనే ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ షోను ఐఎండీబీ నెంబ‌ర్ ఒన్ టాక్ షో గా గుర్తించిన విష‌యం తెలిసిందే.

Also Read: Sarayu Roy: బిగ్‌బాస్ ఫేమ్ సరయు అరెస్ట్.. స్టేషన్‌కు తరలించిన బంజారాహిల్స్ పోలీసులు

Actor Photo: మొదటి సినిమాతోనే అమ్మాయిల మనసు దోచుకున్న ఈ స్టార్.. సీనియర్ హీరో తనయుడు..ఎవరో గుర్తుపట్టండి..

Sarkaru Vaari Paata: ప్రేమికుల రోజున స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న మహేష్.. సర్కారు వారి పాట నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..

Nandita Swetha: హీరోయిన్ శారీరాకృతిపై నెటిజన్ వల్గర్ కామెంట్స్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నందితా శ్వేత..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu