వామ్మో మింగేస్తున్న సముద్రం.. ఆ బీచ్‌కు వెళితే.. అంతే సంగతులు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యం సంతరించుకున్న బాపట్లజిల్లాలోని రామాపురం బీచ్‌లో విహారయాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇక్కడ బీచ్‌లో విహారయాత్రలకు వచ్చిన ఆరుగురు విద్యార్దులు సముద్రపు అలల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. తాజాగా ఈరోజు శుక్రవారం నలుగురు విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి గల్లంతైతే వీరిలో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ది మృతదేహం లభ్యం కాలేదు. దీంతో రామాపురం బీచ్‌.. విహారయాత్రలకు వచ్చే విద్యార్ధులకు మృత్యుసముద్రంగా మారిపోయింది.

వామ్మో మింగేస్తున్న సముద్రం.. ఆ బీచ్‌కు వెళితే.. అంతే సంగతులు..
Ramapuram Beach
Follow us
Fairoz Baig

| Edited By: Srikar T

Updated on: Jun 21, 2024 | 8:50 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యం సంతరించుకున్న బాపట్లజిల్లాలోని రామాపురం బీచ్‌లో విహారయాత్రలు విషాదయాత్రలుగా మారుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇక్కడ బీచ్‌లో విహారయాత్రలకు వచ్చిన ఆరుగురు విద్యార్దులు సముద్రపు అలల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. తాజాగా ఈరోజు శుక్రవారం నలుగురు విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి గల్లంతైతే వీరిలో ముగ్గురు విద్యార్ధుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ది మృతదేహం లభ్యం కాలేదు. దీంతో రామాపురం బీచ్‌.. విహారయాత్రలకు వచ్చే విద్యార్ధులకు మృత్యుసముద్రంగా మారిపోయింది.

రామాపురంలో బీచ్‌లో రిసార్ట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో ఎపిలోనే విహారయాత్రలకు ప్రసిద్దిగాంచింది. ఇక్కడ రిసార్ట్‌లలో రూములు కవాలంటే నెలరోజుల ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. ఇక్కడ రిసార్ట్‌లకు అంత డిమాండ్‌ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌, బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులు ఇక్కడ వీకెండ్‌ గడపడానికి ఎక్కువగా ఆసక్తిచూపుతారు. లివింగ్ రిలేషన్‌లో ఉండే జంటలకు ఇక్కడ సేఫ్టీ ఎక్కువగా ఉందన్న ప్రచారంతో కుటుంబాలతో పాటు ప్రేమికులకు ఇది రిలాక్స్‌ రిసార్ట్‌లుగా మారిపోయాయి. ఇక్కడ అకామడేషన్‌తో పాటు మద్యం కూడా అందుబాటులోనే ఉంటుంది. ఎవరికి ఇష్టమైన మద్యాన్ని వారే తమ వెంట తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకున్న మద్యాన్ని విచ్చలవిడిగా సేవించవచ్చు. అందుకు ఇక్కడ కొన్ని రిసార్ట్‌లలో రాత్రి వేళల్లో లైటింగ్‌లు, డిజెలు, క్యాంప్‌ఫైర్లు ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నారు. మెరైన్‌ పోలీసులు, సివిల్‌ పోలీసుల పహారా ఉన్నా సముద్రపు ఒడ్డుపై డిజేలు ఏర్పాటు చేస్తుంటారు. దీంతో ఇక్కడకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు, ప్రేమికులు ఎక్కువగా వస్తుంటారు. ఇలా వచ్చేవారిలో ఇతర ప్రాంతాల్లో చదువుకునే విద్యార్దులే ఎక్కువగా ఉంటున్నారు.

బాపట్లజిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో విహారయాత్రలకు వచ్చే విద్యార్ధుల సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగింది. కోనసీమ, హైదరాబాద్‌, చెన్నైల నుంచి వచ్చే విద్యార్ధులు సముద్రంలో ఈతకు వెళ్ళి అలల తాకిడికి మృత్యువాత పడుతున్నారు. తాజాగా జూన్ 21న శుక్రవారం ఏలూరుజిల్లాకు చెందిన 11 మంది విద్యార్ధులు రామాపురం బీచ్‌లో విహారయాత్రకు వచ్చారు. వీరంతా సముద్రంలో సరదాగా ఈతకు వెళ్ళారు. స్థానికేతరులు కావడంతో ఎంత లోతులో ఈతకు వెళ్ళాల్లో తెలియక సముద్రంలో కొంతదూరం వెళ్ళారు. పెద్ద అలలు రావడంతో 11 మంది విద్యార్దుల్లో 4గురు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్ధులు నితిన్ (21), అమలరాజు( 22), తేజ( 24), కిషోర్( 22)లుగా గుర్తించారు. కొద్దిసేపటికి వీరిలో మూడు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో విద్యార్ధి మృతదేహం కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు.

ఆదివారాలు మృత్యువారాలు..

చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఈనెల 9న ఆదివారం ఓ యువకుడు గల్లంతయ్యాడు. సెలవురోజు కావడంతో చీరాల మండలంలోని కావూరివారిపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది యువకులు సరదాగా స్నేహితులతో సముద్ర స్నానాలకు వచ్చారు. సముద్ర స్నానాలు చేస్తుండగా అలల తక్కిడికి కాటి జైపాల్ (18 ) ఇంటర్ మీడియట్ చదువుతున్న యువకుడు గల్లంతయ్యాడు. యువకుడి మృతదేహం కోసం మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుండగా మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. జూన్ 12న కనగళ్ల గౌరీష్ (21) అనే యువకుడు సముద్రంలో గల్లంతై మృత్యువాతపడ్డాడు. మృతుడు తాడేపల్లిగూడెం వాసిగా గుర్తించారు పోలీసులు. చెన్నై ఎంజీఆర్ యూనివర్సిటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతు బీచ్ లో సరదాగా గడిపేందుకు రామాపురం బీచ్ కు వచ్చాడు. నలుగురు బీచ్ లో ఊత కొడుతుండగా గౌరీష్ గల్లంతయ్యాడు. కొద్ది సేపటికి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఇక ఇదే నెల 15న మరో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానాలు ఆచరిస్తుండగా అలల తాకిడికి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. నూజివీడులోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న 11 మంది విద్యార్థులు రామాపురం బీచ్‌కు దగ్గరలోని వాడరేవు తీరానికి వచ్చారు. సముద్రంలో స్నానం చేస్తుండగా కోసూరి కార్తీక్, మైలవరపు కేదారేశ్వరరావు అనే ఇద్దరు విద్యార్దులు గల్లంతయ్యారు. వీరిలో ఒక విద్యార్ధి కేదారేశ్వరరావును మెరైన్‌ పోలీసులు కాపాడగలిగారు. గల్లంతైన మరో విద్యార్ది కార్తీక్ మృతదేహం లభించలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..