AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: స్వామివారి హుండీలో వాచీలు, మొబైల్ ఫోన్ల సమర్పణ.. ఈ-వేలం వేయనున్న టీటీడీ ఎప్పుడంటే

కొంత మంది భక్తులు కోనేటి రాయుడికి తలనీలాలు సమర్పిస్తే.. మరికొందరు నగదు, బంగారం, విలువైన వస్తువులను హుండిలో కానుకలుగా సమర్పిస్తారు. ఇలాంటి కానుకలలో విలువైన వాచీలు, మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయి. తాజాగా వెంకన్న హుండీ ద్వారా వచ్చిన వాచీలు, మొబైల్ ఫోన్లను ఆన్ లైన్ లో వేలం వేయనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ వస్తువులను ఈ-వేలం ద్వారా ఈ నెల 24వ తేదీన విక్రయించనున్నామని టీటీడీ ప్రకటన ద్వారా తెలియజేసింది.

Tirumala: స్వామివారి హుండీలో వాచీలు, మొబైల్ ఫోన్ల సమర్పణ.. ఈ-వేలం వేయనున్న టీటీడీ ఎప్పుడంటే
Tirumala Rush 9
Surya Kala
|

Updated on: Jun 21, 2024 | 7:02 PM

Share

తిరుమల తిరుపతి క్షేత్రంలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉంటారు. వెంకన్న కొండపై భక్తుల రద్దీతో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. వైకుంఠ వాసుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. కొంత మంది భక్తులు కోనేటి రాయుడికి తలనీలాలు సమర్పిస్తే.. మరికొందరు నగదు, బంగారం, విలువైన వస్తువులను హుండిలో కానుకలుగా సమర్పిస్తారు. ఇలాంటి కానుకలలో విలువైన వాచీలు, మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయి. తాజాగా వెంకన్న హుండీ ద్వారా వచ్చిన వాచీలు, మొబైల్ ఫోన్లను ఆన్ లైన్ లో వేలం వేయనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ వస్తువులను ఈ-వేలం ద్వారా ఈ నెల 24వ తేదీన విక్రయించనున్నామని టీటీడీ ప్రకటన ద్వారా తెలియజేసింది.

స్వామివారి ప్రధాన ఆలయంలో పాటు తిరుమల తిరుపతి క్షేత్రంలోని ఇతర అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకలుగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను ఈ వేలం లో ఉంచనున్నామని ఆసక్తి ఉన్న భక్తులు ఆన్ లైన్ ఆక్షన్ లో పాల్గొనవచ్చు అంటూ ప్రకటించింది. టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్ వెల్, ఫాస్ట్ ట్రాక్ వంటి ప్రముఖ కంపెనీ వాచీలతో పాటు కార్బన్, శాంసంగ్, నోకియా, మోటారోలా, ఒప్పో వంటి కంపెనీకి సంబంధించిన మొబైల్స్ ఫోన్లు కూడా ఉన్నాయని టిటిడీ వెల్లడించింది.

వీటిని మూడు కేటగిరీలుగా విభజించి వేలంలో పెట్టనున్నామని.. డ్యామేజి ఫోన్లు, వాచీలు, ఉపయోగించినవి, కొత్తవి అనే మూడు రకాలుగా విభజించి భక్తులకు అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలిపింది. ఈ వస్తువులు కావాలని కోరుకునే భక్తులు వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం www.tirumala.org తో పాటు www.konugolu.ap.gov.in వెబ్ సైట్స్ ను సందర్శించమని సూచించింది. అంతేకాదు ఈ వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం 0877-2264429 ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అని తెలిపింది టీటీడీ మార్కెటింగ్ సిబ్బంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..