AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saturday Puja Tips: ఈ పువ్వు అన్ని కోరికలను తీరుస్తుంది! శనివారం ఏ దేవుడిని ఎలా పుజించాలంటే

శనిశ్వరుడు ఎవరి జాతకంలోనైనా అశుభ స్థానంలో ఉంటే చాలా కాలం పాటు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కనుక శనిశ్వరుడిని శాంతింపజేయడానికి శనివారం కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి. శనిశ్వరుడితో పాటు సూర్యదేవుని పూజిస్తే జీవితంలో గౌరవం, సంతోషం, ఐశ్వర్యం పొందడంలో ఎలాంటి కష్టాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి శనివారం గన్నేరు పువ్వులతో శనిశ్వరుడిని పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలుంటాయని నమ్మకం.

Saturday Puja Tips: ఈ పువ్వు అన్ని కోరికలను తీరుస్తుంది! శనివారం ఏ దేవుడిని ఎలా పుజించాలంటే
Saturday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 21, 2024 | 8:26 PM

సనాతన ధర్మం ప్రకారం వారంలో ఏడు రోజులు ఒకొక్క రోజు ఒకొక్క దేవతకు అంకితం చేశారు. ఈ నేపధ్యంలో శనివారం శనిశ్వరుడికి అంకితం చేయబడింది. ప్రతి శనివారం రోజున శనిశ్వరుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజ చేస్తారు. ఆచారాల ప్రకారం శనివారం శని దేవుడిని పూజిస్తే.. శని దేవుడు చాలా సంతోషిస్తాడని నమ్ముతారు. పురాణ గ్రంధాల ప్రకారం శనిదేవుడు న్యాయ దేవుడిగా పరిగణించబడుతున్నాడు. మనిషి చేసే కర్మలకు తగిన కర్మఫలితాలను ఇస్తాడు. అంతేకాదు జాతకంలో శనిశ్వరుడి ప్రభావం బట్టి రాజుగా లేదా బిచ్చగాడిగా జీవిస్తాడని నమ్మకం. శనిశ్వరుడి శుభ దృష్టి ఉంటె బిచ్చగాడు కూడా రాజాస్థానానికి వెళ్ళవచ్చు. శనిశ్వరుడు ఎవరి జాతకంలోనైనా అశుభ స్థానంలో ఉంటే చాలా కాలం పాటు జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. కనుక శనిశ్వరుడిని శాంతింపజేయడానికి శనివారం కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి. శనిశ్వరుడితో పాటు సూర్యదేవుని పూజిస్తే జీవితంలో గౌరవం, సంతోషం, ఐశ్వర్యం పొందడంలో ఎలాంటి కష్టాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి శనివారం గన్నేరు పువ్వులతో శనిశ్వరుడిని పూజిస్తే జీవితంలో సుఖ సంతోషాలుంటాయని నమ్మకం.

శనివారం గన్నేరు పువ్వులతో చేయాల్సిన పరిహారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి వైవాహిక జీవితంలోనైనా సమస్యలు ఉన్నా లేదా వైవాహిక జీవితంలో ఆనందం లేకపోయినా శనివారం రోజున గన్నేరు పువ్వుతో పూజ చేస్తే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మరింత దృఢంగా చేస్తుంది. ఇందుకోసం శనివారం గన్నేరు మొక్కకు నీరు సమర్పించండి. తర్వాత మొక్క చుట్టూ ఎర్రటి దారాన్ని చుట్టి ముడి వేయాలి. ఈ రెమెడీ పాటిస్తే వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. సంబంధం బలపడుతుంది.

ఇంట్లో సిరి సంపదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, జీవితంలో రోజువారీ సమస్యలు,ఇబ్బందులు తలెత్తుతున్నా శనివారం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఒక రాగి పాత్రలో నీటి తీసుకుని అందులో గన్నీరు పువ్వులను వేసి ఆ నీటితో అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వలన శనిశ్వరుడితో పాటు సూర్యదేవుడు కూడా సంతోషిస్తాడు. ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు.

ఇవి కూడా చదవండి

దీనితో పాటు శనివారం గన్నేరు చెట్టుని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సూర్యభగవానుడి, శనిదేవుని అనుగ్రహం పొందాలంటే శంఖం మొక్కను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.