AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: సెంచరీ కొట్టిన టమాటా, పచ్చి మిర్చి.. అదే బాటలో పయనిస్తున్న కూరగాయల ధరలు..

గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా టమాటా సహా అన్ని రకాల కూరగాయలు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్​కు తగిన దిగుబడి లేకపోవడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ఎండ తీవ్రత తగ్గినా ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. పచ్చిమిర్చి కిలో ధర రూ.120కి పైగానే ఉండగా ఉల్లి కేజీ రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు. టమాటా ధరలు దేశాన్ని మండించడం ప్రారంభించాయి.

Tomato Price: సెంచరీ కొట్టిన టమాటా, పచ్చి మిర్చి.. అదే బాటలో పయనిస్తున్న కూరగాయల ధరలు..
Tomato Price Hike
Surya Kala
|

Updated on: Jun 21, 2024 | 5:20 PM

Share

గత కొంతకాలంగా పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తుండగా.. ఇప్పుడు కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. ఇప్పటికే ఉల్లి ధర పెరగడంతో హోటల్స్ వారు నో ఉల్లిపాయ అనే బోర్డు పెట్టేయ్యగా.. ఇప్పుడు టమాటా ధరలు మళ్ళీ కొండెక్కాయి. దేశ వ్యాప్తంగా అని కూరగాయల ధరలు పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా టమాటా సహా అన్ని రకాల కూరగాయలు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్​కు తగిన దిగుబడి లేకపోవడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ఎండ తీవ్రత తగ్గినా ఉల్లి, టమాటా సహా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. పచ్చిమిర్చి కిలో ధర రూ.120కి పైగానే ఉండగా ఉల్లి కేజీ రూ.50కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు.

టమాటా ధరలు దేశాన్ని మండించడం ప్రారంభించాయి. ఇప్పటికే దేశంలోని 17 రాష్ట్రాల్లో టమాటా ధరలు రూ.50 దాటాయి. మరో వైపు తొమ్మిది రాష్ట్రాల్లో టమాటా ధరలు కిలో రూ.60 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇక నాలుగు రాష్ట్రాల్లో టమాటా ధర రూ.70 కంటే ఎక్కువగా ఉంది. ఒక్క రాష్ట్రంలోనే టమాటా ధర రూ.100 దాటింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎండల వేడి, టమోటాల ఉత్పత్తి తగ్గినందున.. రానున్న రోజుల్లో, టమోటా ధరలు రూ. 100 దాటే అవకాశం ఉన్న రాష్ట్రాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

టమాటా ధరలు ఎక్కడ ఎలా ఉన్నాయంటే

దేశంలోని కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్‌లో టమోటా ధరలు రూ.100 దాటాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ నుంచి అందిన సమాచారం ప్రకారం, జూన్ 20న ఇక్కడ టొమాటో ధర కిలోకు రూ.100.33గా ఉంది. ఆ తర్వాత కేరళలో టమాటా ధర కిలో రూ.82కి చేరింది. మిజోరం, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా ధరలు కిలో రూ.70 దాటాయి. తెలంగాణ, గోవా, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రల్లో టమాట కిలో రూ.60కి పైగా విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, సిక్కిం, ఒడిశా, దాద్రా అండ్ నగర్ హవేలీ, మేఘాలయ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో టమాటా ధరలు కిలో రూ.50కి చేరాయి. దేశంలోని 17 రాష్ట్రాల్లో టమాటా ధర రూ.50కి పైగా ఉంది

ఇవి కూడా చదవండి

దేశంలో సగటు ధర ఎంత పెరిగిందంటే

వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం టమోటా సగటు ధరలో మంచి పెరుగుదల ఉంది. జూన్ నెలలో టమాటా సగటు ధర కిలోకు రూ.12.46 పెరిగింది. మే 31న టమాటా సగటు ధర కిలో రూ.34.15గా ఉంది. జూన్ 20న దేశ సగటు టమోటా ధర కిలో రూ.46.61కి చేరింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో టమోటాల ద్రవ్యోల్బణం ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు దేశ రాజధాని డిల్లీలో కిలో టమాటా ధర రూ.33గా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..