AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ice Cream: టెన్షన్ పెడుతున్న వేలు..100 ఐస్‌క్రీమ్స్‌ డెలివరీ.. ఉద్యోగి రక్త పరీక్ష కోసం నిరీక్షణ

మలాడ్ పోలీసులు ఐస్‌క్రీమ్‌ విషయంలో మరో సమాచారం ఇచ్చారు. వేలు తెగిన ఉద్యోగి రక్త నమూనాను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనికి ఇప్పటికే వైద్యం చేస్తున్నారు. అంతేకాదు అతనికి ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉందా అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వేలు కట్ అయిన సమయంలో అతని రక్తం ఐస్‌క్రీమ్‌పై పడి ఉంటే.. అప్పుడు 100 కంటే ఎక్కువ ఐస్‌క్రీమ్ కోన్‌లు కలుషితం అయి ఉంటాయని చెబుతున్నారు.

Ice Cream: టెన్షన్ పెడుతున్న వేలు..100 ఐస్‌క్రీమ్స్‌ డెలివరీ.. ఉద్యోగి రక్త పరీక్ష కోసం నిరీక్షణ
Human Finger Found In Icecream
Surya Kala
|

Updated on: Jun 21, 2024 | 6:14 PM

Share

జూన్ 13న మహారాష్ట్రలోని ముంబైలో ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన మానవ వేలు కనిపించడం ఆ విషయం పోలీసుల దృష్టికి చేరుకొని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంలో పోలీసుల విచారణ రకరకాల కోణంల్లో కొనసాగుతోంది. మరోవైపు మలాడ్ పోలీసులు ఐస్‌క్రీమ్‌ విషయంలో మరో సమాచారం ఇచ్చారు. వేలు తెగిన ఉద్యోగి రక్త నమూనాను తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూణేకు చెందిన 24 ఏళ్ల ఓంకార్ పోటే అనే ఉద్యోగికి ఇప్పటికే వైద్యం చేస్తున్నారు. అంతేకాదు అతనికి ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉందా అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వేలు కట్ అయిన సమయంలో అతని రక్తం ఐస్‌క్రీమ్‌పై పడి ఉంటే.. అప్పుడు 100 కంటే ఎక్కువ ఐస్‌క్రీమ్ కోన్‌లు కలుషితం అయి ఉంటాయని చెబుతున్నారు. ఉద్యోగికి ఏదైనా తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు గుర్తించినట్లయితే.. ఆ 100కి పైగా ఐస్ క్రీమ్స్ తిన్న వారు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు.

జూన్ 13న ముంబైలోని మలాడ్‌లో ఒక డాక్టర్ ఆన్‌లైన్ యాప్ ద్వారా తినడానికి 3 ఐస్‌క్రీమ్‌లను ఆర్డర్ చేసింది. డెలివరీ అయిన వెంటనే ఆ డాక్టర్ ఐస్ క్రీం ప్యాకింగ్ ఓపెన్ చేసింది. ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు కనిపించడంతో తినబోతున్న డాక్టర్ నోటి నుండి అరుపు వచ్చింది. భయపడిన డాక్టర్ మొదట ఐస్ క్రీమ్ ను పరిశీలించాడు. అప్పుడు ఆ ఐస్‌క్రీమ్‌లో 2 సెంటీమీటర్ల పొడవున్న మనిషి వేలి కనిపించింది. ఈ ఐస్‌క్రీమ్‌ యమ్మో కంపెనీకి చెందినది.

వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీంతో మలాడ్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మానవ వేలితో పాటు ఐస్‌క్రీమ్‌ను పరీక్షల నిమిత్తం పంపించారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు యమ్మో ఐస్‌క్రీం కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వేలు ఆ కంపెనీలో పని చేస్తున్న ఓ ఉద్యోగిది అని తేలింది. దీంతో పోలీసులు పూణెలోని యమ్మో ఐస్‌క్రీం ఫ్యాక్టరీకి చేరుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ ఉద్యోగి పని చేస్తున్న సమయంలో వేలు కోసుకున్నట్లు అక్కడి విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తికి వైద్యపరీక్షలు చేశారు. అతని రక్త పరీక్ష కూడా జరిగింది. ఇప్పుడు మెడికల్ రిపోర్టు రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నామని పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..