AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga: ఆరోగ్యంగా ఉన్నాడా లేదా శ్వాస నియంత్రణ చేసే సమయం తెలియజేస్తుందని మీకు తెలుసా..

గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ వర్మ మాట్లాడుతూ.. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది వ్యక్తీ ఎంత సేపు శ్వాసను నియంత్రించుకోగలడు అనే విషయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి తన శ్వాసను ఎంతసేపు నియంత్రించగలడు అనే ప్రశ్న తరచుగా చాలా మంది మనస్సులో కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే వ్యక్తీ వ్యక్త్యి తన శ్వాసను నియంత్రించే సమయం సాధారణంగా మారుతూ ఉంటుంది.

Yoga: ఆరోగ్యంగా ఉన్నాడా లేదా శ్వాస నియంత్రణ చేసే సమయం తెలియజేస్తుందని మీకు తెలుసా..
Yoga Benefits
Surya Kala
|

Updated on: Jun 21, 2024 | 3:47 PM

Share

మనిషికి శ్వాస కంటే ముఖ్యమైనది ఏదీ ఉండదు. వాస్తవానికి నీరు మానవునికి అత్యంత ముఖ్యమైన అవసరం అయితే త్రాగే నీటి కంటే శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. మెరుగైన ఆక్సిజన్ ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలడు. అటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడో మీకు తెలుసా? ఒక వ్యక్తి రోజుకు సుమారు 22 వేల సార్లు గాలిని పీల్చి వదులుతాడని మీకు తెలియజేద్దాం.

గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ వర్మ మాట్లాడుతూ.. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది వ్యక్తీ ఎంత సేపు శ్వాసను నియంత్రించుకోగలడు అనే విషయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి తన శ్వాసను ఎంతసేపు నియంత్రించగలడు అనే ప్రశ్న తరచుగా చాలా మంది మనస్సులో కలుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే వ్యక్తీ వ్యక్త్యి తన శ్వాసను నియంత్రించే సమయం సాధారణంగా మారుతూ ఉంటుంది.

ఎంతసేపు ఊపిరి పీల్చుకోవడం ఆరోగ్యానికి సంకేతం?

ఇవి కూడా చదవండి

డాక్టర్ వర్మ ఇంకా మాట్లాడుతూ సగటు ఆరోగ్యవంతమైన వ్యక్తి తన శ్వాసను 30 సెకన్ల నుంచి 90 సెకన్ల వరకు ఎటువంటి సమస్య లేకుండా నియంత్రించగలడు. అంటే ఈ కాలం శ్వాసను పట్టుకోవడం ఆరోగ్యకరమైన శరీరం గురించి చెబుతుంది. అయితే.. ఎవరైనా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే లేదా ప్రొఫెషనల్ అథ్లెట్ అయితే వారు శ్వాసను నియంత్రించే సామర్థ్యం ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు.

ధూమపానం చేసే వ్యక్తుల్లో తక్కువ సామర్థ్యం

మరోవైపు ధూమపానం, ఇతర ఆరోగ్య పరిస్థితుల వల్ల ప్రభావితమైన వ్యక్తుల్లో తమ శ్వాసను నియంత్రించుకునే సామర్ధ్యం తక్కువగా ఉంటుంది. శ్వాసను నియంత్రించే విషయంలో ఎటువంటి నిర్ణీత ప్రమాణం లేదు అయితే 30 నుండి 90 సెకన్ల పాటు శ్వాసను పట్టుకోగల వ్యక్తులు ఆరోగ్యవంతులుగా పరిగణించబడతారు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా శ్వాసను నియంత్రణ ఈ సమయం కంటే చాలా తక్కువ సమయం చేస్తే వారు తప్పని సరిగా తమ జీవనశైలిని మెరుగుపరచుకోవాలి. దీని కోసం వారు క్రమం తప్పకుండా వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమను దినచర్యలో చేర్చుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు డాక్టర్ పంకజ్ వర్మ.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..