- Telugu News Photo Gallery There are also yogasanas to increase height, check here is details in Telugu
Yoga for Height Increase: హైట్ పెరిగేందుకు కూడా యోగాసనాలు ఉన్నాయండోయ్.. బెస్ట్ రిజల్ట్..
చాలా మంది హైట్ తక్కువగా ఉన్నందుకు బాధ పడుతూ ఉంటారు. ఇందు కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఏవేవో ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల లాభం కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. అలాగే జన్యుపరంగా కూడా మీ హైట్ అనేది నిర్దారించబడుతుంది. కానీ హైట్ తక్కువగా ఉండేవారికి హైట్‌గా ఉండాలి అనుకుంటారు. మీరు హైట్ అవ్వాలి అనుకుంటే యోగాలో బెస్ట్..
Updated on: Jun 21, 2024 | 3:26 PM

చాలా మంది హైట్ తక్కువగా ఉన్నందుకు బాధ పడుతూ ఉంటారు. ఇందు కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఏవేవో ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటి వల్ల లాభం కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అనేక అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తూ ఉంటాయి.

అలాగే జన్యుపరంగా కూడా మీ హైట్ అనేది నిర్దారించబడుతుంది. కానీ హైట్ తక్కువగా ఉండేవారికి హైట్‌గా ఉండాలి అనుకుంటారు. మీరు హైట్ అవ్వాలి అనుకుంటే యోగాలో బెస్ట్ ఆసనాలు ఉన్నాయి. ట్రై చేయవచ్చు. మరి ఎలాంటి ఆసనాలు వేస్తే హైట్ పెరగవచ్చో ఇప్పుడు చూద్దాం.

తడసానా వేయడం వల్ల మీరు హైట్ పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ ఆసనం పిల్లలు, పెద్దలు ఎవరైనా వేయవచ్చు. తరచూ క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తూ ఉంటే.. మీలో మార్పును గమనిస్తారు.

హైట్ పెరిగేందుకు వృక్షాసనం కూడా ఎంతో సహాయ పడుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల.. గ్రోత్ హార్మోన్ స్రావానికి కారణం అయ్యే మీ పిట్యూటరీ గ్రంథిని యాక్టివ్ అవుతుంది. ఇలా తరచూ వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎత్తు పెరిగేందుకు చక్రాసనం కూడా హెల్ప్ చేస్తుంది. హైట్ పెరగాలి అనుకునేవారు చక్రాసనం కూడా వేస్తూ ఉండండి. ఇలా తరచూ ఈ ఆసనం వేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ ఆసనాలు పిల్లలు, పెద్దలు కూడా చేయవచ్చు.




