అమెరికాలో EVMల వాడకం తక్కువ.. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహణకు అసలు కారణం ఇదే..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) పై ఎలాన్ మస్క్ ఒక ప్రకటన చేశారు. వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉందని ట్వీట్ చేసిన తర్వాత భారతదేశంలో ఈవీఎంలపై అనేక ప్రకంపనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో యంత్రం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎందుకు ఓటింగ్ చేస్తారన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. దీనికి గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ అయినా, అమెరికా అయినా ఈవీఎం వాడకంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) పై ఎలాన్ మస్క్ ఒక ప్రకటన చేశారు. వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉందని ట్వీట్ చేసిన తర్వాత భారతదేశంలో ఈవీఎంలపై అనేక ప్రకంపనలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో యంత్రం కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎందుకు ఓటింగ్ చేస్తారన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. దీనికి గల కారణం ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ అయినా, అమెరికా అయినా ఈవీఎం వాడకంపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. అమెరికన్ బిలియనీర్ ఎలోన్ మస్క్ ఇటీవల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM) పై ఒక ప్రకటన ఇచ్చారు, ఆ తర్వాత EVM బదులుగా బ్యాలెట్ పేపర్‌ను ఉపయోగించాలనే అనేక రాజకీయ నాయకుల నుంచి డిమాండ్ పెరగడం ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని అలెన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. వాటిని నిర్మూలించాలన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ తీవ్ర దుమారం రేపుతోంది. 1800ల సంవత్సరం చివరలో అమెరికన్ ఎన్నికలలో మెకానికల్ ఓటింగ్ మిషన్లు ప్రవేశపెట్టబడ్డాయి. కానీ నేటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేస్తారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో, కాగితం, ఎలక్ట్రానిక్ యంత్రాలు రెండూ అందుబాటులో ఉన్నాయి. అయితే, కొలరాడో, ఒరెగాన్, వాషింగ్టన్‌లలో ఓటింగ్ పూర్తిగా పేపర్ ద్వారానే జరుగుతుంది. డెలావేర్, జార్జియాతో సహా 5 రాష్ట్రాలు మాత్రమే మెషిన్ ఓటింగ్‌ను కలిగి ఉన్నాయి.
అమెరికా మరియు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు..
సాంకేతికత అధికంగా ఉన్న దేశం అయినప్పటికీ, అమెరికా ప్రజలు పేపర్ ఓటింగ్ కే తొలి ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ అలా చేయడం వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఎన్నికల సహాయ కమీషన్ (EAC) చైర్మన్ టామ్ హిక్స్ పేపరు ఓటింగ్ వినియోగాన్ని కొనసాగించడానికి ప్రాథమిక కారణం మొదటిది భద్రత అయితే రెండవది ఓటరు ప్రాధాన్యత అని తెలిపారు.
పేపర్‌లెస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా ఓట్లను త్వరగా, కచ్చితంగా లెక్కించే అవకాశం ఉంటుంది. తద్వారా ఫలితం కూడా త్వరగా వస్తుంది. 2000 సంవత్సరం మధ్యకాలం నుండి అమెరికా, యూరోపియన్ దేశాలలో మెషీన్ ఓటింగ్‌పై ప్రజాదరణ తగ్గింది. ఈ దేశాలు తమ ఎన్నికలను ఆడిట్ చేయడానికి సాధ్యమయ్యే పేపర్ ఓటింగ్‌ను అత్యంత సురక్షితమైన మార్గంగా ఎంచుకున్నారు. 2000 సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకల తర్వాత, ప్రభుత్వం 3 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. కేవలం ఎన్నికల కోసం ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించింది. ఆ నిధులతో అనేక రాష్ట్రాలు డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ (DRE) యంత్రాలను కొనుగోలు చేసి ఉపయోగించాయి. ఎన్నికల ప్రక్రియపై ఓటరు విశ్వాసాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం. ఓటర్లలో అప్పటికే అనేక సందేహాలు పెరిగిపోయాయి.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో లోపాలు..
అమెరికా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లోని అతిపెద్ద లోపం ఏమిటంటే ఎలక్ట్రానిక్ ఓటును బ్యాకప్ చేయడానికి ఒక కచ్చితమైన రికార్డు లేదు. దీని అర్థం ఏమిటంటే, ఎన్నికల అధికారులు యంత్రాలను హ్యాక్ చేయడం లేదా ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని ప్రజలు విశ్వసించేలా కొన్ని చర్యలను ప్రారంభించాలి. అలా జరగకపోతే ఓట్లు బదిలీ అవుతాయి లేదా తొలగిపోతాయని భావించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు ఆదరణ రోజు రోజుకు తగ్గడానికి ప్రధాన కారణం.. సోషల్ మీడియాలో వాటి భద్రతా లోపాలను ప్రచారం చేయడమే అని భావిస్తున్నారు కొందరు. దీనికి కారణం కూడా ఒక ప్రముఖ వార్తా సంస్థ అయిన రాయిటర్స్ కొన్ని సంచలన విషయాలను పొందుపరిచింది. సోషల్ మీడియాలో ఎన్నికల యంత్రాల గురించి తప్పుడు సమాచారం వస్తోందని.. ఓటింగ్, కౌంటింగ్ యంత్రాలు తారుమారు అవుతున్నాయని ట్రంప్ వంటి అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది.
ఓటింగ్ యంత్రం ధర..
ఇ-ఓటింగ్ విషయంలో భద్రత ఒక్కటే ఆందోళన కలిగించే అంశం కాదు. ఓటింగ్ యంత్రాల ధర కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అమెరికాలోని ప్రతి రాష్ట్రంలో ఉన్నత అధికారులు ఓటింగ్ లో ఎన్ని యంత్రాలను ఉపయోగించాలో నిర్ణయిస్తారు. అయితే వాటికి కేటాయించిన బడ్జెట్లు చాలా పరిమితంగా ఉంటాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ కు వెళ్లేందుకు మక్కువ చూపుతున్నారు.
మరిన్ని ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..