YSRCP: పులివెందులకు మాజీ సీఎం జగన్ .. కడప నుంచే యాక్షన్ ప్లాన్..
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకూ పులివెందులకురాని వైఎస్ జగన్.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి జూన్ 22న పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో మకాం వేయనున్నారు. జూన్ 21న మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన పులివెందుల నియోజకవర్గానికి వెళతారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటి వరకూ పులివెందులకురాని వైఎస్ జగన్.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి జూన్ 22న పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో మకాం వేయనున్నారు. జూన్ 21న మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన పులివెందుల నియోజకవర్గానికి వెళతారు. అనంతరం స్థానిక నేతలు కార్యకర్తలతో వైసీపీ అధినేత మాట మంతి నిర్వహించనున్నారు. ఆదివారం కడప జిల్లా నేతలు, కార్యకర్తలతో వైసీపీ అధినేత జగన్ భేటీ కానున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.
అనంతరం సోమవారం మధ్యాహ్నం పులివెందుల నియోజకవర్గానికి తిరిగి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం గెలవలేక పోవడానికి గల కారణాలు.. అందులోనూ ముఖ్యంగా తన సొంత జిల్లాలో దాదాపు 7 గురు ఓడిపోవడానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. గడిచిన కొన్ని దశాబ్ధాలుగా ఎప్పుడూ ఎంతటి ఘోర పరాభవం చూడని వైఎస్ కుటుంబం.. మొట్టమొదటిసారి కడప జిల్లాలో భారీ ఓటమిని చవిచూసింది. ఉమ్మడి కడప జిల్లాలోని పది నియోజకవర్గాలకుగానూ ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. పులివెందులలో జగన్తో పాటు జిల్లాలో మరో ఇద్దరు మాత్రమే గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిస్థితుల నడుమ జిల్లాలో పార్టీని బలోపేతం చేయటం.. క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించేందుకు ఈ పర్యటన చేపట్టనున్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలంగా నడపటం కోసం కార్యకర్తలతో పాటూ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని జగన్ హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సొంత జిల్లా నేతలతో జగన్ మూడు రోజుల పాటు బిజీబిజీగా ఉండనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..