AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: జగన్‌ అధికారాన్ని వదులుకోలేడు.. మనమే లాక్కోవాలి.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

సినిమా డబ్బింగ్ అయ్యాక నేనే వదిలేస్తా. మీరెందుకు మాట్లాడతారు? పోలవరం, మహిళా, పిల్లల ట్రాఫికింగ్, అప్పులు, సమస్యల గురించి మాట్లాడండి. వైసీపీ నేతల ట్రాప్ లో పడకండి. సినిమా నాకు అవసరమే. పార్టీ నడపడానికి సినిమాలు చేస్తున్నా. రాజకీయాల్లోకి సినిమా ను తీసుకుని రాకండి. సినిమా గురించి అభిమానులు మాట్లాడతారు'అని పార్టీ నాయకులకు సూచించారు పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: జగన్‌ అధికారాన్ని వదులుకోలేడు.. మనమే లాక్కోవాలి.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
Cm Jagan, Pawan Kalyan
Basha Shek
|

Updated on: Aug 04, 2023 | 7:03 PM

Share

బీజేపీతో పొత్తు విషయంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ నేతలను ఇబ్బంది పెడుతుంటే బీజేపీ రాష్ట్ర నాయకులు స్పందించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘బీజేపీ నేతల్ని పోలీసులు కొడితే నేను ఖండించా.. మా నేతల్ని ఇబ్బంది పెడుతుంటే బిజెపి రాష్ట్ర నాయకులు మాట్లాడటం లేదు. ఎన్‌డీఏ సమావేశానికి ఊరికే పిలవలేదు. పదేళ్లు పోరాటాలు చేశాక పిలిచారు. ఆంధ్రప్రదేశ్, మంగళగిరి నా నివాస స్థానం. ఇక్కడ ఇల్లు కూడా లేదు.. పార్టీ కార్యాలయంలోనే ఉంటున్నా.తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నా. జనసేనపై పై మహిళకు, యువతకు ఇష్టం ఉంది. ఇష్టాన్ని ఓటింగ్ గా మార్చుకోవాలి. ఈ ఎన్నికలు 2019 లా ఉండవు. సర్వేలు చేయిస్తున్నా. అధ్యయనం చేస్తున్నా. మూడవ విడత వారాహి యాత్ర గురించి జాతీయ స్థాయిలో చర్చ జరగబోతుంది. గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు రాదు. విశాఖ లో కూడా వైసీపీ గల్లంతవుతుంది. కొత్తవాళ్ళు పార్టీలోకి వస్తుంటే మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. ఎవరూ రావద్దు అని ఆలోచనా ధోరణి మానుకోవాలి. టీవీ డిబేట్స్ లో చిల్లరగా మాట్లాడకండి. ప్రిపేర్ అయ్యి మాట్లాడండి. టీవీ డిబేట్లలో రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడండి. సినిమాల గురించి మాట్లాడకండి’. సినిమా డబ్బింగ్ అయ్యాక నేనే వదిలేస్తా. మీరెందుకు మాట్లాడతారు? పోలవరం, మహిళా, పిల్లల ట్రాఫికింగ్, అప్పులు, సమస్యల గురించి మాట్లాడండి. వైసీపీ నేతల ట్రాప్ లో పడకండి. సినిమా నాకు అవసరమే. పార్టీ నడపడానికి సినిమాలు చేస్తున్నా. రాజకీయాల్లోకి సినిమా ను తీసుకుని రాకండి. సినిమా గురించి అభిమానులు మాట్లాడతారు’అని పార్టీ నాయకులకు సూచించారు పవన్‌ కల్యాణ్‌.

అధికారాన్ని లాక్కుందాం..

వచ్చే ప్రభుత్వంలో జనసేన ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కాకూడదనే ఆలోచన తనకు లేదని, అయితే దానికి తగిన పరిస్థితి ఉండాలని అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయ ఆధిపత్యం వదులుకునేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా లేరని అన్నారు. సాధికారత కోసం అధికారాలన్ని లాక్కోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘నా సినిమాల గురించి వైసీపీ నేతలు మాట్లాడతారు. ఇష్యూను డైవర్ట్‌ చేసేందుకు వాళ్లు మాట్లాడతారు. రాజకీయాల్లోకి సినిమాను తీసుకురాకండి . రాజకీయాన్ని నడిపేందుకు సినిమాలు నాకు ఇంధనం. రాజకీయ ఆధిపత్యాన్ని జగన్ వదులుకోడు. సాధికారత కోసం మనం అధికారాన్ని లాక్కోవాలి . ఆశయం కోసం ఓడిపోతే సమాజంపై నమ్మకం పోతుంది. వచ్చే ప్రభుత్వంలో జనసేన ఉంటుంది. సీఎం కాకూడదని నేను ఎప్పుడూ అనుకోలేదు. మంగళగిరి నా నివాస స్థానం. వైజాగ్‌లో ఒక్క సీటు కూడా వైసీపీకి రాదు . కొత్తవాళ్లను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిద్దాం’ అని పవన్‌ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..