మటన్ లివర్ vs చికెన్ లివర్.. ఇందులో ఏది మంచిది..? ఎవరు తినకూడదు..
వారానికి ఒక రోజు మాంసం తినడం మాంసాహారులకు అలవాటుగా మారింది. ప్రస్తుత కాలంలో చికెన్ లివర్, మటన్ లివర్ తినే వారి సంఖ్య కూడా పెరిగింది.. ఎందుకంటే వీటిలో అనేక పోషకాలు దాగున్నాయి.. అందుకే.. నాన్ వెజ్ ఇష్టపడే చాలా మంది చికెన్ మటన్ లివర్ ఇష్టంగా తింటారు..

మాంసాహారులు వారానికి కనీసం ఒకసారైనా చికెన్, మటన్, చేపలను తింటారు. అయితే.. ఇటీవల, పోషకాల ఎక్కువ ఉన్న చికెన్ లివర్, మటన్ లివర్ వినియోగం పెరిగింది. ఈ రెండూ అధిక పోషకాలు కలిగిన ఆహారాలు. కానీ ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది.. ఏది తినడానికి ఉత్తమైనది.. అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి.. చికెన్ లివర్.. మటన్ లివర్ విషయంలో ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..
చికెన్ లివర్ తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చికెన్ లివర్‌లో ఐరన్, సెలీనియం, విటమిన్ ఎ, బి12, ఫోలేట్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని సెలీనియం కంటెంట్ క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
అదనంగా, విటమిన్ ఎ, బి12 కంటి, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు డయాబెటిక్ అయితే, ఇది చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఉడికించిన కాలేయం తినడం వల్ల శరీర కొవ్వు తగ్గుతుంది.
చికెన్ లివర్ కంటే మటన్ లివర్ ను ఎందుకు ఎక్కువగా తింటారు..
చాలా మంది చికెన్ లివర్ కంటే మటన్ లివర్ తినడానికి ఇష్టపడతారు. మటన్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చాలా మంది ముందుగా దానిని వండుకుని తింటారు. ఇందులో విటమిన్లు ఎ, డి, బి12, జింక్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల, దీనిని తినడం వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.
శరీరంలో రక్తం తక్కువగా ఉండటం వల్ల కొంతమందికి రక్తహీనత వస్తుంది. అలాంటి వారికి మటన్ లివర్ మంచి ఆహారం. విటమిన్ బి12 శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
ఏ సమస్యలున్న వారు చికెన్, మటన్ లివర్ తినకూడదు..
అయితే, కొంతమంది చికెన్, మటన్ లివర్ తినకూడదు.. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మందుబాబులకు అలర్ట్.. మద్యం తాగుతూ ఈ పదార్థాలను తిన్నారంటే డైరెక్టుగా ఆసుపత్రికే..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
