AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Women’s T20I Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో షెఫాలీ వర్మ జైత్రయాత్ర.. శ్రీలంక సిరీస్ తెచ్చిన లక్కీ ఛాన్స్!

ICC Women's T20I Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన మహిళా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా టీమిండియా డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ తన అద్భుత ఫామ్‌తో ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ చేసింది.

ICC Women's T20I Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో షెఫాలీ వర్మ జైత్రయాత్ర.. శ్రీలంక సిరీస్ తెచ్చిన లక్కీ ఛాన్స్!
Shafali Verma (1)
Rakesh
|

Updated on: Dec 30, 2025 | 3:50 PM

Share

ICC Women’s T20I Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన మహిళా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు సత్తా చాటారు. ముఖ్యంగా టీమిండియా డాషింగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ తన అద్భుత ఫామ్‌తో ర్యాంకింగ్స్‌లో భారీ జంప్ చేసింది. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారించిన షెఫాలీ, ఇప్పుడు తన తోటి క్రీడాకారిణి స్మృతి మంధాన స్థానానికే ఎసరు పెడుతోంది.

శ్రీలంకపై విరుచుకుపడ్డ షెఫాలీ

శ్రీలంకతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో షెఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లోనే ఆమె ఏకంగా 236 పరుగులు సాధించింది. ఇందులో మూడు వరుస హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. 118 సగటుతో, 185కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన షెఫాలీ, ఈ సిరీస్‌లో 200 పరుగుల మైలురాయిని దాటిన తొలి బ్యాటర్‌గా నిలిచింది. ఆమె బ్యాట్ నుంచి 36 ఫోర్లు, 5 సిక్సర్లు జాలువారాయి. ఈ నిలకడైన ఆటతీరు ఆమెకు ర్యాంకింగ్స్‌లో పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు

తాజా ర్యాంకింగ్స్‌లో షెఫాలీ వర్మ ఏకంగా నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 10వ స్థానం నుంచి 6వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం షెఫాలీ 736 రేటింగ్ పాయింట్లతో ఉండగా, మూడో స్థానంలో ఉన్న స్మృతి మంధాన 767 పాయింట్లతో ఉంది. వీరిద్దరి మధ్య వ్యత్యాసం కేవలం 31 పాయింట్లే. షెఫాలీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలోనే స్మృతిని వెనక్కి నెట్టి టాప్-3లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు టాప్-10లో భారత్ నుంచి ముగ్గురు బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. స్మృతి (3), షెఫాలీ (6) తో పాటు జెమీమా రోడ్రిగ్స్ 10వ స్థానంలో నిలిచింది.

ప్రపంచ నంబర్ వన్ ఎవరంటే?

మహిళల టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బెత్ మూనీ 794 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ హేలీ మాథ్యూస్ 774 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 615 పాయింట్లతో 15వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. భారత ఓపెనర్లు ఇద్దరూ టాప్-5లో పోటీ పడుతుండటం టీమిండియాకు రాబోయే వరల్డ్ కప్ ముందు శుభపరిణామంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారా .. జాగ్రత్త.. వీడియో
యాంటీబయాటిక్స్‌ వాడుతున్నారా .. జాగ్రత్త.. వీడియో
బొగ్గుల కుంపటిని వెలిగించారు.. తెల్లారేసరికే విషాదం వీడియో
బొగ్గుల కుంపటిని వెలిగించారు.. తెల్లారేసరికే విషాదం వీడియో
కాన్పు తర్వాత కడుపునొప్పి.. స్కాన్ చేస్తే లోపలున్నది చూసి షాక్‌
కాన్పు తర్వాత కడుపునొప్పి.. స్కాన్ చేస్తే లోపలున్నది చూసి షాక్‌
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
సినిమా హిట్టవ్వడంతో.. వెంకన్న సన్నిధికి ఛాంపియన్ టీం వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి సినిమా ఎక్కడ జరుగుతోంది? వీడియో
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
2026 మాదే.. అనుమానాలు అక్కర్లేదంటున్న అక్కినేని హీరోలు వీడియో
రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో
రాజాసాబ్ న్యూ ట్రైలర్.. ఆ మూడు గమనించారా..? వీడియో
ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో
ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక వీడియో
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా సురేష్‌బాబు ఎన్నిక వీడియో