Ongole: కదులుతున్న రైలుకి, ప్లాట్‌ఫాం మధ్యలో ప్రయాణికుడు… సీన్ కట్ చేస్తే.. చివరికి ఏమైందంటే..
ఒంగోలు రైల్వే ప్లాట్‌ఫాం... వచ్చేపోయే రైళ్ళతో, ప్రయాణీకులతో రద్దీగా ఉంది... ఆ సమయంలో తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరింది. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడ కాలు జారింది. అంతే రైలుకు, ప్లాట్‌ఫాం మద్యలో పడిపోయాడు. పూర్తిగా పడిపోతూ..
ఒంగోలు రైల్వే ప్లాట్‌ఫాం… వచ్చేపోయే రైళ్ళతో, ప్రయాణీకులతో రద్దీగా ఉంది… ఆ సమయంలో తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్ళే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం నుంచి బయలుదేరింది. కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో ఓ ప్రయాణికుడ కాలు జారింది. అంతే రైలుకు, ప్లాట్‌ఫాం మద్యలో పడిపోయాడు. పూర్తిగా పడిపోతూ రైలుబోగీ తలుపును బలంగా పట్టుకున్నాడు. దీంతో ప్లాట్‌ఫాం, రైలుకు మధ్యలో ఇరుక్కుని రైలుతో పాటు ఈడ్చుకుంటూ వెళుతున్నాడు ఈ దృశ్యం చూసిన ప్రయాణీకులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు… అంతా భయంగా అరుస్తున్నారే కానీ సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అదే సమయంలో ప్లాట్‌ఫాంపై ఫోను మాట్లాడుకుంటూ వెళుతున్న రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ఈ దృశ్యాలను చూశాడు… వెంటనే ఒక్కదుటున రైలు దగ్గరకు పరుగు తీశాడు. రైలుకు, ప్లాట్‌ఫాంకు మధ్య ఈడ్డుకుంటూ వెళుతున్న ప్రయాణీకుడిని పట్టుకుని పైకి లాగేశాడు. అప్పటికే ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణీకులు కేకలు వేయడతో ఎవరో రైల్లో చైన్ లాగారు. రైలు ఆగిపోయింది అప్పటికే ప్రయాణీకుడిని చావు బారినుంచి కాపాడాడు ఆర్‌పియఫ్ ఏఏస్‌ఐ శ్రీనివాసరావు.
అప్పటిదాకా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయిన ప్రయాణీకులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు… చిన్నపాటి గాయాలతో బయటపడ్డ ప్రయాణీకుడు అదే రైల్లో తిరిగి వెళ్లిపోయాడు… ప్రమాదం జరుగుతున్న సమయంలో సమయస్పూర్తితో వ్యవహరించి ప్రయాణీకుడి ప్రాణాలు కాపాడిన ఆర్‌పియఫ్ ఏఎస్‌ఐ శ్రీనివాసరావును పలువురు అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..