చనిపోయిన కొడుకుకి ఇంట్లోనే గుడి కట్టిన తల్లిదండ్రులు.. విగ్రహానికి రోజూ పూజలు చేస్తూ అందులోనే బిడ్డను చూసుకుంటూ జీవనం..

Anantapur District: ఏ తల్లిదండ్రులైన తమ పిల్లలపైనే ఎన్నో ఆశలు పెట్టుకని జీవిస్తుంటారు. మరి ఆ బిడ్డే అందరికీ దూరంగా, అందని లోకాలకు వెళ్ళిపోతే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. తమ శార్థ కర్మలు చేయాల్సిన బిడ్డ.. తమ కన్నా ముందుగానే ఈ లోకం విడిచి వెళ్ళిపోతే, ఆ బాధ వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఇదే రీతిలో కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ తల్లిదండ్రులు తమ బిడ్డను కోల్పోయారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్న కన్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు..

చనిపోయిన కొడుకుకి ఇంట్లోనే గుడి కట్టిన తల్లిదండ్రులు.. విగ్రహానికి రోజూ పూజలు చేస్తూ అందులోనే బిడ్డను చూసుకుంటూ జీవనం..
Gangadhar Statue And Parents
Follow us
Nalluri Naresh

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 13, 2023 | 12:02 PM

అనంతపురం జిల్లా, సెప్టెంబర్ 13: ఏ తల్లిదండ్రులు అయినా తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. వారి ఆలనా పాలనా చూసుకుంటూ తమకు స్థోమత లేకపోయినా పిల్లలు ఉన్నత శిఖరాలను ఎదిగేలా అప్పులు తెచ్చి మరీ చదివిస్తుంటారు. వారిపైనే ఎన్నో ఆశలు పెట్టుకని జీవిస్తుంటారు. మరి ఆ బిడ్డే అందరికీ దూరంగా, అందని లోకాలకు వెళ్ళిపోతే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. తమ శార్థ కర్మలు చేయాల్సిన బిడ్డ.. తమ కన్నా ముందుగానే ఈ లోకం విడిచి వెళ్ళిపోతే, ఆ బాధ వారిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఇదే రీతిలో కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ తల్లిదండ్రులు తమ బిడ్డను కోల్పోయారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకున్న కన్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను గుండెల్లోనే కాక, ఇంట్లో గుడిని కూడా కట్టి పూజించుకుంటూ జీవిస్తున్నారు. చనిపోయిన బిడ్డను విగ్రహం రూపంలో చూసుకుంటూ.. అతని జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ తమ మధ్య ఉన్నాడన్న అనుభూతితో జీవిస్తూ.. పూజిస్తూ ఉన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అనంతపురం జిల్లా పామిడి పట్టణానికి చెందిన ఆదినారాయణ, నాగలక్ష్మి దంపతులు ఇద్ధరూ రిటైర్డ్ ఉధ్యోగులు. వీరికి ఒక్కగానొక్క కొడుకు గంగాధర్. తండ్రి ఆదినారాయణ రైల్వేలో గేట్ మెన్ గా పనిచేసి.. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరీ కొడుకు గంగాధర్‌కు ఉద్యోగం ఇప్పించాడు. అయితే కొన్నాళ్ళకు గంగాధర్ అనారోగ్యంతో మృతి చెందటంతో కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక.. కొడుకు మృతి చెందినా తమతోనే ఉండాలని ఆదినారాయణ, నాగలక్ష్మి దంపతులు ఓ నిర్ణయం తీసుకున్నారు.

పామిడి పట్టణంలోని తమ ఇంట్లోనే గంగాధర్‌కు గుడి కట్టారు. చనిపోయిన తమ కొడుకు విగ్రహాన్ని పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తెనాలిలో ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహానికి ప్రతీ రోజు బట్టలు మారుస్తూ.. పూజలు చేస్తూ అక్కడే పడుకుంటూ విగ్రహంలోనే తమ కొడుకుని చూసుకుంటూ జీవిస్తున్నారు. అలాగే తమ కొడుకు గంగాధర్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ బిడ్డ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు ఆ దంపతులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..