Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..

Rain Alert For AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రెయిన్ అలర్ట్.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..
మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే.! బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 13, 2023 | 11:33 AM

Rain Alert For AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఋతుపవన ద్రోణి బలంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఏపీలో కోస్తా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 17వరకు ఉభయ తెలుగు రాష్ట్రలకు వర్ష సూచన ఉన్నట్టు ప్రకటించింది భారత వాతావరణ శాఖ. కోస్తాలో తేలిక పాటి నుంచి మోస్తారు, భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. చాలా చోట్ల ఓ మోస్తరు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తాజా వెదర్ బుల్లెటిన్‌లో వెల్లడించింది.

కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్..

ఏపీలో, తెలంగాణలో వర్షాలు కురిసేందుకు బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అల్పపీడనం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో చిరుజల్లులతోపాటు మోస్తారు వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం మరో 24 గంటల్లో బలంగా మారనుంది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది భారత వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా లో చాలాచోట్లా, దక్షిణకొస్తా జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడే ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ నిపుణులు. తాజా అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ నేపత్యంలో అప్రమత్తంగా ఉండాలని జాలర్లకు సూచించారు.

తెలంగాణలో..

ఇదిలాఉంటే.. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో సైతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. హైదరాబాద్ లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు మరో రెండు రోజులు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది.

కాగా.. కొన్ని చోట్ల వర్షాలు లేకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఖరీప్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో వర్షాలు కురవాలని వరుణ దేవుడి వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.