AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: చంద్రబాబుపై ఆ సెక్షన్లు చెల్లవు.. రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్.. ఇవాళ కీలక విచారణ..

Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి.. ఏసీబీ కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబుకు బెయిల్ కోసం ఆయన తరుపు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన కీలక పిటిషన్ల విచారణ ఈ రోజు కోర్టులో జరగనుంది.

Chandrababu: చంద్రబాబుపై ఆ సెక్షన్లు చెల్లవు.. రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్.. ఇవాళ కీలక విచారణ..
Chandrababu Naidu Arrest
Shaik Madar Saheb
|

Updated on: Sep 13, 2023 | 10:42 AM

Share

Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టు చేసి.. ఏసీబీ కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే, చంద్రబాబుకు బెయిల్ కోసం ఆయన తరుపు లాయర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన కీలక పిటిషన్ల విచారణ ఈ రోజు కోర్టులో జరగనుంది. సరైన సాక్ష్యాలు లేకుండానే జ్యుడిషియల్ రిమాండ్ విధించారంటూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. ఈ నెల 10న ఏసీబీ కోర్టు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఉత్తర్వులు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకూ ఏసీబీ కోర్టులో విచారణ నిలిపివేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరుతున్నారు. యాంటీ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13, ఐపీసీ 409లు చెల్లవనీ.. రాజకీయ ప్రతీకారంతోనే ప్రాథమిక సాక్ష్యాలు లేకపోయినప్పటికీ కేసు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. దీనిపై హైకోర్ట్ విచారణ చేపట్టబోతోంది. మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన కీలక పిటిషన్ల విచారణ జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇదిలాఉంటే.. చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇప్పటి వరకు చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ పిటీషన్ పై కూడా ఏసీబీ కోర్టు ఇవాళ విచారించనుంది.

అంతేకాకుండా.. ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ పై కూడా ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ను స్క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బయలు పిటిషన్ పై కూడా విచారణ జరుగనుంది. ఇదిలాఉంటే.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ సీఐడీ అధికారులు 2022లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

వీటన్నింటి నడుమ ఇవాళ అటు హైకోర్టు.. ఇటు ఏసీబీ కోర్టుల నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయనేది ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
తెలుగులో తోపు హీరోయిన్.. చివరకు అంత్యక్రియలకు డబ్బుల్లేక..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధరాత్రి వచ్చే ఈ కల.. మీ జీవితంలో రాబోయే బిగ్ ట్విస్ట్‌కు..
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
అర్ధశతకాలలో సెంచరీ.. టీ20ల్లో బట్లర్ అరుదైన రికార్డ్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
స్విమ్మింగ్ పూల్‌లో ప్రియుడితో ఎంజాయ్..అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చిన
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
భర్తపై పోక్సో కేసు.. మోనాలిసా మిస్సింగ్..
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌పై బీసీసీఐ విచారణ
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
గంటల తరబడి హై హీల్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త! మీ మోకాళ్లు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే
ఉలవచారు చికెన్ ఇలా వండితే ఎవరైనా లొట్టలేసుకుని తినాల్సిందే