Chandrababu Arrest: చంద్రబాబు విడుదలవ్వాలని తిరుమలకు పాదయాత్ర.. 60 మందితో కలిసి 230 కిలోమీటర్లు..
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించగా.. గత మూడు రోజులుగా జైలులో ఉన్నారు. అయితే, చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.
కడప, సెప్టెంబర్ 13: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల పాటు జ్యూడీషియల్ రిమాండ్ విధించగా.. గత మూడు రోజులుగా జైలులో ఉన్నారు. అయితే, చంద్రబాబు జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం పొద్దుటూరులోని తన నివాసం నుంచి తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆయన్ను అభినందించారు. చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకోవడానికి చేపట్టిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పాదయాత్రలో.. టీటీపీ కార్యకర్తలు కూడా భాగస్వామ్యమయ్యారు. ప్రవీణ్ తోపాటు మరో 60 మంది కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం పొద్దుటూరులోని తన నివాసం నుంచి ప్రవీణ్ పాదయాత్రను ప్రారంభించారు. ఈరోజు నుంచి వారంపాటు ఈ పాదయాత్ర సాగనుంది. పొద్దుటూరు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు 230 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
పాదయాత్ర చేపట్టిన సందర్భంగా ప్రొద్దుటూరు టిడిపి ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ తను జైలు జీవితం అనుభవించారని అందరినీ జైల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అందర్నీ జైల్లోకి నెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కష్టపడిన వ్యక్తిని పగబట్టి కావాలనే చట్టానికి విరుద్ధంగా అర్థరాత్రి అరెస్టులు చేసి జైలుకు పంపారనన్నారు. మచ్చలేని నాయకుడిగా చంద్రబాబు తిరిగి బయటకు వస్తారని.. రాబోయే ఎన్నికలలో వైసీపీకి ప్రజలు సరైన బుద్ధి చెబుతారంటూ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. వేలకోట్లు దోపిడీ చేసింది జగనేనని.. ఈడీ కేసులు నార్మల్ కేసులు పదుల సంఖ్యలో పెట్టుకొని బెయిల్ మీద బయట తిరుగుతున్న ఆయన కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని సూచించారు. లేకపోతే టిడిపి కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా బుద్ధి చెబుతారన్నారు.
రాబోయే ఎన్నికల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని.. వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు అన్నీ బయటకు తీస్తామని అప్పుడు అసలైన దొంగలు బయటపడతారని ప్రవీణ్ రెడ్డి అన్నారు. చంద్రబాబును విడుదల చేయాలని తాను తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్ర చేస్తున్నానని.. తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..