Pandem Kollu: పల్లెల నుంచి పార్శిల్‌లో పట్టణాలకు పందెం కోళ్లు.. ఆన్‌లైన్‌లో జోరుగా గిరాకీ..!

Pandem Kollu: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు,..

Pandem Kollu: పల్లెల నుంచి పార్శిల్‌లో పట్టణాలకు పందెం కోళ్లు.. ఆన్‌లైన్‌లో జోరుగా గిరాకీ..!

Pandem Kollu: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది కోడి పందాలు. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల సంబరాలు ఇలా వీటన్నింటి మధ్యలో పోటా పోటీగా కోడి పందాలు. సంక్రాంతి పండగ వచ్చిందంటే పల్లెల్లో కోడి పందాల జోరు అంతా ఇంతా కాదు. అయితే పండగకు ఐదు నెలల ముందు నుంచే కోడి పందాలకు సన్నద్ధం అవుతుంటారు. కోడి పందాలకు లక్షల్లో ఖర్చు ఉంటుంది. కోళ్లకు పెట్టే ఖర్చును చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. ఇక పందెం కోళ్లను పల్లెటూర్ల నుంచి పార్శిల్‌లో పట్టణాలకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి సమీపిస్తూండటంతో.. ఆన్‌లైన్‌లో పందెం కోడికి యమ గిరాకి ప్రారంభమైంది. తగ్గేదేలేదంటూ పందెం కోళ్లు కాలుకు కత్తికట్టి బరిలోకి దిగేందుకు పట్టణాలు పోతున్నాయి. ఉభయగోదావరి జిల్లా నుండి సోషల్ మీడియా వేదికగా పందెం కోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు, హరిదాసుల కోలాహలం,ముగ్గులు గొబ్బెమ్మలు అని గ్రామీణ క్రీడలే ముద్దు కోడిపందాలు వద్దు అని పోలీసులు ఒక పక్క ప్రచారం చేస్తూంటే అవేమీ పట్టకుండా తగ్గేదేలేదంటూ కాలుకు కత్తికట్టి బరిలోకి దిగేందుకు జిల్లాలు దాటి పట్టణాలు పోతున్నాయి పందెంకోళ్ళు. సంక్రాంతి పండుగ సమీపిస్తూండటంతో.. ఆన్‌లైన్‌లో పందెం కోడికి గిరాకి పెరిగింది. వాట్సాప్, ఫేసు బుక్ సోషల్ మీడియా వేదికగా రూ. 5 వేల నుండి 50 వేలకు పైగా పందెంకోళ్లు ధరలు పలుకుతున్నాయి. ఈస్ట్ గోదావరి పందెంకోళ్ళు ఫేస్ బుక్ లో అన్నిరకాల పందెం కోళ్ళు పెట్టి, వాటి వయస్సు, ఎన్ని పందాలు గెలిచింది వంటి వివరాలతో పూర్తి వివరాలు పెట్టి అమ్ముతున్నారు కోళ్ళ వ్యాపారులు. వాటి ట్రైల్ వీడియోలు కూడా పోస్టులు చేస్తూన్నారు.

ఈ విధంగా అమ్మిన వాటినీ పార్శిల్ చేయటానికి కూడా ఒక రేటు ఫిక్స్ చేసి బస్సులు, ఆటోలు, వ్యాన్‌లలో పంపిస్తూన్నారు. ఇటువంటి సంఘటన తూర్పుగోదావరి జిల్లా నుండి విజయవాడ పార్శిల్ వేళుతున్న పందెంకోడి పార్శిల్ బాక్స్ టీవీ9 కెమెరా కంట చిక్కింది. ఒక అట్టపెట్టేలో కోడిని పెట్టి గాలితగిలెందుకు వీలుగా చూట్టూ కన్నాలు పెట్టి, ఆహారంగా టొమాటోలు పెట్టి పార్శిల్ చేసి పంపుతున్నారు. నగదు వ్యవహారం అంతా యుపీఐ, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఆన్‌లైన్‌ ట్రాన్సక్షన్ జరిగిపోతున్నాయి. పందెంకోడి నచ్చకపోతే రిటన్ కూడా పంపించవచ్చని భరోసా ఇస్తున్నారు కోళ్ళు వ్యాపారులు.

కోడి పుంజుల్లో రకాలు: పందెలకు రెడీ చేసే కోడి పుంజుల్లో కూడా చాలా రకాలుంటాయి. వాటిలో గౌడ నెమలి, తెల్లనెమలి, కోడి నెమలి, కాకి డేగ, కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్‌, ఎర్రడేగ వంటి జాతులు ఉంటాయి. వీటిలో తెల్ల నెమలి, గౌడ నెమలి, రసంగి, అబ్రాస్‌ పుంజులు ఎంతటి పందెంనైనా నెగ్గే శక్తి ఉంటుందట. ఒక్కో పుంజు ఖర్చు రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. పందెలలో పాల్గొనే పుంజులకు బలమైన ఆహారం ఇవ్వడంతో పాటు కొన్ని నెలల నుంచి ప్రత్యేక శిక్ష ఇచ్చి పందెలలో తట్టుకునే విధంగా శిక్షణ ఇస్తారు.

ఒక్కో పుంజుకు లక్షల్లో ధర.. అయితే పూర్తి స్థాయిలో కోడి పుంజులు పందేలకు సిద్ధమైన తర్వాత ఒక్కో పుంజుకు లక్షల్లో ధర పలుకుతుందని శిక్షకులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ నెల రోజుల ముందు నుంచే పుంజులకు చాలా గిరాకీ ఉంటుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Coronavirus Effect: విజృంభిస్తున్న కరోనా.. జనవరి 30 వరకు స్కూల్స్ బంద్.. మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..!

Telangana Inter Exams 2022: మేలో ఇంటర్మీడియేట్‌ పరీక్షలు.. ప్రణాళికలు రూపొందిస్తున్న ఇంటర్‌ బోర్డు..!

Published On - 11:20 am, Sat, 8 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu