Coronavirus Effect: విజృంభిస్తున్న కరోనా.. జనవరి 30 వరకు స్కూల్స్ బంద్.. మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం..!
Coronavirus Effect: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరో వైపు..
Coronavirus Effect: దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో థర్డ్‌వేవ్ మొదలైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది. కొన్ని రాష్ట్రాలలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్ దిశగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక లాక్‌డౌన్ ఆంక్షలు, ఇతర చర్యలు చేపడుతుండగా, ఇప్పుడు సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఇక తాజాగా అస్సాం రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి అసోం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలను మరింత కఠినతరం చేసింది. ఈ క్రమంలోనే 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ జనవరి 30 వరకు పాఠశాలలు మూసివేయబడతాయని వెల్లడించింది. అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ కూడా.. కర్ఫ్యూ సమయాలు రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు ఉంటాయని చెప్పారు.
ఇక దేశంలో కూడా రికార్డు స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా లక్షా 41,986 కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 285 మంది మృతి చెందారు. అలాగే ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలోని 27 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇప్పటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,071 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్రలో 876 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఢిల్లీలో 513, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తెలంగాణలో 128, తమిళనాడులో 121 కేసులు, హర్యానాలో 114, ఒడిశాలో 60, ఉత్తరప్రదేశ్‌లో 31, ఆంధ్రప్రదేశ్‌లో 28, పశ్చిమ బెంగాల్‌లో 27 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది
ఇవి కూడా చదవండి: