AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna University: కేంద్రానికి వెళ్లకుండానే పరీక్షలు.. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో అవకతవకలు

కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో(Practical Exams) అవకతవకలు జరిగాయి. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ప్రయోగ పరీక్షలపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మొదటి నుంచి విమర్శలు...

Krishna University: కేంద్రానికి వెళ్లకుండానే పరీక్షలు.. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో అవకతవకలు
Practical Exams
Ganesh Mudavath
|

Updated on: Mar 27, 2022 | 11:25 AM

Share

కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో జరిగిన ప్రాక్టికల్ పరీక్షల్లో(Practical Exams) అవకతవకలు జరిగాయి. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన ప్రయోగ పరీక్షలపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. పలువురు వర్సిటీకి ఫిర్యాదులు(Complaint) చేశారు. వారి ఫిర్యాదుతో అధికారులు ఒక తనిఖీ బృందాలను నియమించి ఆకస్మిక తనిఖీలు చేయించారు. ఈ సోదాల్లో అనేక విషయాలు వెలుగుచూశాయి. కృష్ణా జిల్లాలోని(Krishna District) 97 పరీక్షా కేంద్రాల్లో ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 17న ప్రారంభమైన పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మొత్తం 12,550 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. చాలా చోట్ల విద్యార్థులు అసలు పరీక్ష కేంద్రానికే వెళ్లకుండా తరగతి గదిలోనే ఉన్నట్లు బృందాలు గుర్తించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించకుండానే జరిగినట్లు చూపించే ప్రయత్నం చేసినట్లు తనిఖీ బృందాలు గుర్తించారన్న అంశం విశ్వవిద్యాలయవర్గాల్లో సంచలనంగా మారింది.

కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులు తాము చదువుతున్న కళాశాలల్లోనే ప్రయోగ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. ఈ వెసులుబాటు యాజామాన్యాలకు కలిసివచ్చినట్లయ్యింది. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాల్సిన యాజమాన్యాలు ఒక్కొక్కరి నుంచి నగదు తీసుకుని మార్కులు తామే వేస్తామని చెప్పారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం తనిఖీ బృందాలు కేంద్రాల వారీగా పరిశీలించిన అంశాలతో నివేదిక తయారు చేస్తున్నారు.

Also Read

Allu Arjun – Kalyan Ram: అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌లకు షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు..

RRR Movie: కుంభస్థలాన్ని బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్న రామ్- భీమ్.. రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే..

News Watch: ఉగాది తర్వాత ఉద్యమమే మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Follow Us
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
HIV ఉందని పెళ్లికి నో చెప్పిన యువతి.. యువకుడు చేసిన పనికి..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
భద్రాచల సీతారాముల తలంబ్రాలు నేరుగా ఇంటికే..! ఎలా పొందాలో తెలుసా..
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బీర్ సీసాతో చపాతీ.. ఇటుకలతో పొయ్యి.. పారతో టిఫిన్ భలే చేసాడుగా
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
బాహుబలి సినిమా ఛాన్స్ మిస్సైన హీరోయిన్ ఎవరంటే..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
జాక్‌పాట్.. రూ.1.25 కోట్ల లాటరీ తగిలింది.. ఆశ దోశ అప్పడం వడ..
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
బోరుబావి నుండి నీటి బదులు ఎగసిపడుతున్న మంటలు! షాక్‌లో గ్రామస్తులు
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో అల్లు అర్జున్ కూతురు..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
రాముడు ప్రతిష్ఠించిన శివ లింగం.. తెలుగు రాష్ట్రంలో ఎక్కడ ఉందంటే..
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
పండగ అంటే అందరికీ శుభం.. కానీ వారికి మాత్రం ఉగాది నుంచి వాయింపే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 2 రోజులు వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్