Nellore Politics: ఎన్నికలకు ముందే వేడెక్కిన సింహాపురి.. తనపై పోటీ చేసి గెలవాలని ఆనంకు నేదురుమల్లి సవాల్
2009లో ఆనం ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచి, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కి దూరమయ్యాక 2016లో టిడిపిలో చేరారు. మళ్లీ 2019లో వైసీపీలో చేరి వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఈ మధ్యే పార్టీ నుంచి బయటకు వచ్చాక ఏ పార్టీలో చేరుతారన్న దానిపై రకరకాల చర్చ జరిగింది.
ఎన్నికలకు ముందే సింహపురి పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. ఈ సారి రచ్చ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వర్సెస్ నేదురుమల్లి కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఆనం ఆత్మకూరులో కాదు..దమ్ముంటే వెంకటగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి. మరి ఈ సవాల్‌ను ఆనం స్వీకరిస్తారా..? చూడాలి మరి.
రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజాగా తన సైలెన్స్ వీడారు. గత మూడు నెలలుగా రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆనం ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గంలో యాక్టివ్‌గా కనబడుతున్నారు. 2009లో ఆనం ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచి, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కి దూరమయ్యాక 2016లో టిడిపిలో చేరారు. మళ్లీ 2019లో వైసీపీలో చేరి వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఈ మధ్యే పార్టీ నుంచి బయటకు వచ్చాక ఏ పార్టీలో చేరుతారన్న దానిపై రకరకాల చర్చ జరిగింది.
ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి యాక్టివ్‌గా తిరుగుతున్నారు. త్వరలో టీడీపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం ఉదయగిరి నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆనం… చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే, తానూ అక్కడి నుంచే బరిలో దిగుతానని కామెంట్ చేశారు. 60 శాతం ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని హాట్ కామెంట్ చేశారు ఆనం. వైసీపీ వెంకటగిరి ఇంఛార్జ్‌గా ఉన్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి..ఆనం కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు. 60 శాతం కాదు కదా…ఆరుగురు కూడా వైసీపీని వీడరన్నారు. ఆత్మకూరులో కాదు…ఆనంకు దమ్ముంటే వెంకటగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. మరి ఆనం రామనారాయణరెడ్డి ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు నేదురుమల్లి. వెంకటగిరిలో పోటీ చేయాలన్న సవాల్‌ను ఆనం స్వీకరిస్తారో..? లేదో వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..