Andhra Pradesh: హజ్‌ యాత్రికులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రూ.80 వేల సాయం.. గన్నవరం నుంచి నేరుగా విమాన సదుపాయం

2014 తర్వాత తొలిసారి హజ్ యాత్రికుల కోసం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి అంతర్జాతీయ విమానాలు నడవనున్నాయి. గన్నవరం నుంచి జెడ్డా చేరుకోనున్నాయి విమానాలు. జూన్ 9న 155 మంది హజ్ యాత్రికులతో మొదటి విమానం వెళ్లనుంది. జూన్ 17 వరకు రోజుకొక విమానం హజ్‌ యాత్రికులతో వెళ్లనుంది.

Andhra Pradesh: హజ్‌ యాత్రికులకు ఏపీ సర్కార్ శుభవార్త.. రూ.80 వేల సాయం.. గన్నవరం నుంచి నేరుగా విమాన సదుపాయం
Haj Flights From Vijayawada
Follow us
Surya Kala

|

Updated on: May 25, 2023 | 6:52 AM

హజ్‌ యాత్రికులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీ నుంచి నేరుగా హజ్‌ యాత్రకు వెళ్లేలా గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన సదుపాయం కల్పించింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల హజ్‌ యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ముస్లింలు హజ్ ‍యాత్రను పవిత్రంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా హజ్‌ యాత్రకు వెళ్లాలని తాపత్రయపడతారు. అయితే, హజ్‌ యాత్రికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటివరకు పొరుగు రాష్ట్రాలకు వెళ్తేనే హజ్‌ యాత్రకు విమానాలు ఉండేవి.. కానీ.. విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్‌ ఏర్పాటు కావడంతో జూన్ 7న విజయవాడ నుంచి హజ్ యాత్రలు ప్రారంభం కానున్నాయి. 2014 తర్వాత తొలిసారి హజ్ యాత్రికుల కోసం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి అంతర్జాతీయ విమానాలు నడవనున్నాయి. గన్నవరం నుంచి జెడ్డా చేరుకోనున్నాయి విమానాలు. జూన్ 9న 155 మంది హజ్ యాత్రికులతో మొదటి విమానం వెళ్లనుంది.

జూన్ 17 వరకు రోజుకొక విమానం హజ్‌ యాత్రికులతో వెళ్లనుంది. ఆ తర్వాత 22వ తేదీ వరకు మరిన్ని విమాన సర్వీసులు పెంచనున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి హజ్ యాత్రకు వెళ్తుండేవారు ఏపీ హజ్ యాత్రికులు. కానీ.. ఇకపై నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది జగన్‌ ప్రభుత్వం. జూన్ 7 నుంచి నుండి జూన్ 19 వరకు హజ్ యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజూ విజయవాడ నుంచి 155 మంది హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. 1,813 మంది హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి 80వేల చొప్పున 14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికుల కోసం గుంటూరు జిల్లా నంబూరులోని మదరసాలో వసతి కల్పించారు. అక్కడి నుంచి బస్సుల ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..