Minister Roja: రోజా నా మజాకానా.. క్రికెట్ బ్యాట్ పట్టి సిక్స్‌లు కొట్టిన మంత్రి రోజా..
చిత్తూరు జిల్లా నగరిలో క్రికెట్ ఆడి సందడి చేశారు మంత్రి రోజా. చిత్తూరు ఎస్పీ బౌలింగ్ వేస్తే.. రోజా బ్యాట్ పట్టి సిక్సులు కొట్టారు.
చిత్తూరు జిల్లా నగరిలో ఏపీ ప్రభుత్వం ఏటా నిర్వహించే వేసవి క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి రోజా. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జూలై 7 వరకు క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. దానిలో భాగంగా.. హ్యాండ్ బాల్, వాలీబాల్, బాల్ బాడ్మింటన్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ, కరాటే, యోగ ఆటల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ వేసవి శిబిరాన్ని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు మంత్రి రోజా. ఈ సందర్భంగా మైదానంలో బ్యాట్ పట్టి సందడి చేశారు. చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి బౌలింగ్ వేయగా.. రోజా బ్యాట్‌తో బంతిని కొట్టి పరుగులు తీయించారు. రోజా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఆ తర్వాత.. ఎస్పీతో కలిసి బ్యాడ్మిటన్, టేబుల్ టెన్నిన్ ఆడారు మంత్రి రోజా. క్రీడాకారుల కోసం రోజా ప్రత్యేక చొరవ చూపడంతో కొత్త హంగులతో నగరిలో క్రీడాప్రాంగణం రూపుదిద్దుకుంది. శిక్షణకు తగిన విధంగా క్రికెట్ నెట్ ప్రాక్టీస్ పిచ్, హ్యాండ్‌బాల్ కోర్టు, ఇండోర్ టెన్నిస్ కోర్టు, టేబుల్ టెన్నిస్ కోర్టు, చెస్, క్యారంబోర్డు రూమ్స్ ప్రత్యేక హంగులతో సిద్ధం చేశారు. చదువుల్లో అలసిన విద్యార్థులకు వేసవి సెలవుల్లో ఈ క్రీడా శిక్షణ శిబిరాలు శిక్షణతోపాటు ఆనందాన్ని కలిగిస్తాయన్నారు మంత్రి రోజా. శిక్షణతోపాటు గ్రామీణ స్థాయిలో నైపుణ్యం గల క్రీడాకారులను గుర్తించి వారికి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తుందని చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..