AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విశ్వవిద్యాలయం విధుల్లో కొత్త సెక్యూరిటీ గార్డు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !

అది 2002 సంవత్సరం... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ భూములు కావడం, యూనివర్సిటీలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండి వనాన్ని తలపిస్తుండటంతో పెద్ద ఎత్తున కోతుల గుంపు విశ్వవిద్యాలయంలోకి వచ్చేది. వచ్చిన కోతులు ఊరికే ఉంటాయా...క్లాస్ రూమ్స్ తోపాటు హాస్టల్స్ గదుల్లోకి చొరబడేవి.

ఆ విశ్వవిద్యాలయం విధుల్లో కొత్త సెక్యూరిటీ గార్డు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. !
Capped Langur
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 30, 2025 | 4:35 PM

Share

అది 2002 సంవత్సరం… ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ భూములు కావడం, యూనివర్సిటీలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండి వనాన్ని తలపిస్తుండటంతో పెద్ద ఎత్తున కోతుల గుంపు విశ్వవిద్యాలయంలోకి వచ్చేది. వచ్చిన కోతులు ఊరికే ఉంటాయా…క్లాస్ రూమ్స్ తోపాటు హాస్టల్స్ గదుల్లోకి చొరబడేవి. అందిన వాటినల్లా పాడు చేసేవి. దీంతో కోతుల భయం విద్యార్ధులు, అధ్యాపకులను వెంటాడేది.

కోతుల బెడద తొలగించుకోవడానికి యూనివర్సిటీ పాలక వర్గం చాలా ప్రయత్నాలే చేసింది. అయితే అవేవి అంతగా విజయవంతం కాలేదు. ఈ క్రమంలోనే ఓ సెక్యూరిటీ గార్డును పెట్టుకోవాలని నిర్ణయించారు. అదేమనండి ఓ కొండముచ్చును తీసుకొస్తే కోతులు పారిపోతాయని ఎవరో సలహా ఇచ్చారు. దీంతో ఒక కొండముచ్చుని తీసుకొచ్చి దేవయ్య అనే ఉద్యోగికి అప్పగించారు. కోతులున్న చోటుకి కొండముచ్చుని తీసుకెళ్లడమే దేవయ్య పని. మొదట్లో పెద్ద ఎత్తున ఉన్న కోతుల గుంపుల వద్దకు కొండముచ్చుని తీసుకుని దేవయ్య వెళ్లేవాడు. కొండముచ్చుని చూసిన కోతులు పారిపోయేవి.

అయితే విశ్వవిద్యాలయం రెండు వందల ఎకరాల్లో విస్తరించి ఉండటంతో ఒకవైపున తరిమితే మరొకవైపునకు చేరేవి. దీంతో దేవయ్య యూనివిర్సిటీ మొత్తం తిరగడం కష్టంగా మారింది. దేవయ్య కొండముచ్చుకి సైకిల్ అలవాటు చేశాడు. కొండముచ్చుని సైకిల్ క్యారేజ్ పై కూర్చొబెట్టుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లేవాడు. దీంతో కోతులు పారిపోయేవి. ఈ ప్రయత్నం సఫలీకృతం కావడంతో దేవయ్యకి కొండముచ్చు ఆలనా పాలనా చూసుకునేందుకు ప్రతి నెల కొంత మొత్తాన్ని అందించేలా విశ్వవిద్యాలయం పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ దేవయ్య కొండముచ్చుని సైకిల్ పై కూర్చోబెట్టుకొని విశ్వవిద్యాలయం అంతా తిరుగుతూనే ఉంటాడు.

ప్రస్తుతం రెండు పూటలా కొండముచ్చుతో యూనివర్సిటీకి దేవయ్య వస్తున్నాడు. అయితే ఈ ఇరవై ఏళ్ల కాలంలో రెండు కొంముచ్చులు చనిపోయాయని మూడో కొండముచ్చుని సాకుతున్నట్లు దేవయ్య చెప్పుకొచ్చాడు. బయట వాళ్లు ఎవరైనా యూనివర్సిటీకి వెళితే, దేవయ్యని, కొండముచ్చుని వింతగా చూస్తుంటారు. గానీ అక్కడి విద్యార్ధులు, అధ్యాపకులకు మాత్రం వీరికి చిర పరిచుతులే..!

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
2026 మకరరాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా? కెరీర్, ఆర్థిక పరిస్థితి
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
మరో వారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026.. సిద్ధమేనా?
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
ఉన్న చోటే ఉంటూ నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు!
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
రూ. 43 కోట్లతో డాడీస్ జట్టు ర్యాంపేజ్ మాములుగా ఉండదు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
గంభీర్ పదవిపోతే.. ఈ ఆటగాడు టీమిండియాలో ఎప్పటికీ కనిపించడు
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
తరుచుగా ముఖం కడిగితే మొటిమలు తగ్గుతాయా.. అపోహలు కాదు వాస్తవాలు..
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!