Jana Sena: ఈ నియోజకవర్గం జనసేనలో మూడుముక్కలాట.. ఫలించని బుజ్జగింపులు.. ఎవరి దారి వారిదే..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం లేకపోతోంది. పార్టీ శ్రేణుల తీరు చెరో దారి అన్నట్లు తయారైంది. జిల్లాలో పలుచోట్ల కొరవడిన సమన్వయం ఎవరికి వారే నిర్ణయంగా సాగుతోంది. ప్రతి చోటా మూడు గ్రూపులు ఆరు కార్యాలయాలు అన్నట్టు కార్యకలాపాలు జరపడంతో జనసేన రాజకీయం ఆసక్తిగా మారింది. ఒక్కొక్కరికి ఒక్కో గ్రూప్. ఒకచోట కూటమి అభ్యర్థికి మద్దతు మరోచోట ఏకంగా టికెట్ కోసమే ప్రయత్నం.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం లేకపోతోంది. పార్టీ శ్రేణుల తీరు చెరో దారి అన్నట్లు తయారైంది. జిల్లాలో పలుచోట్ల కొరవడిన సమన్వయం ఎవరికి వారే నిర్ణయంగా సాగుతోంది. ప్రతి చోటా మూడు గ్రూపులు ఆరు కార్యాలయాలు అన్నట్టు కార్యకలాపాలు జరపడంతో జనసేన రాజకీయం ఆసక్తిగా మారింది. ఒక్కొక్కరికి ఒక్కో గ్రూప్. ఒకచోట కూటమి అభ్యర్థికి మద్దతు మరోచోట ఏకంగా టికెట్ కోసమే ప్రయత్నం. ఎక్కడ జనసేన నాయకత్వం ఒక్కటిగాలేని పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన దుస్థితి. 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సెగ్మెంట్లతో పాటు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేనలో ఎవరి దారివారిది అన్నట్లు పరిస్థితి నెలకొంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి అసెంబ్లీలో జనసేన పోటీకి అవకాశం చక్కగా అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థి వ్యవహారం ఆ పార్టీలో విభేదాలకు కారణమైంది. అరణి శ్రీనివాసులు స్థానికేతరుడన్న వినిపిస్తున్న వాదన జనసేనలో రెండు గ్రూపులకు కారణం అయింది. స్థానిక బలిజ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని జనసేనలోని ఆ సామాజిక వర్గం పట్టుబడడంతో ఈ వ్యవహారం ముదురుపాకన పడింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి జనసేన రెండు గ్రూపులైంది.
తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఒక గ్రూపుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ మరో గ్రూపుగా విడిపోవడంతో జనసేన కేడర్‌లో కన్ఫ్యూజన్ నేలకొంది. జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులకు మద్దతుగా పసుపులేటి హరిప్రసాద్ వర్గం ఉండగా.. తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ వర్గాన్ని పట్టించుకోని జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు ఒంటరి ప్రచారానికి సిద్దం అంటున్నారు. దీంతో తిరుపతి జనసేన వ్యవహారం అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టేలా చేసింది. జనసేన క్రమశిక్షణ సంఘం సభ్యులు అజయ్ కుమార్ తిరుపతికి వచ్చి పార్టీ లోని అసమతి నేతలతో మాట్లాడిన ప్రయోజనం లేకపోయింది. దీంతో నాగబాబుతో భేటీ అనివార్యమైంది. తిరుపతి జనసేన అభ్యర్థి అంశంపై నాగబాబుతో జనసేన నేతల సమావేశం జరిగింది. జనసేన అభ్యర్థి అరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న జనసేన నేతలతో చర్చించిన నాగబాబు, క్రమశిక్షణ సంఘం సభ్యుడు అజయ్ కుమార్ అందరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జనసేన గ్రూపులు ఏకం చేయకపోగా శ్రీకాళహస్తి జనసేనలోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. 3 గ్రూపులుగా విడిపోయిన జనసేన పార్టీ ముక్కంటి క్షేత్రంలో కూటమి అభ్యర్థికి ఇబ్బంది కలిగించేలా పరిస్థితి మారిపోయింది.
శ్రీకాళహస్తి ఇన్చార్జ్ కోటా వినూత ఒక వర్గంగా కొట్టే సాయి మరోవర్గమైతే అంజూరు చక్రధర్ మూడోవర్గంగా విడిపోయిన జనసేన నేతలు శ్రీకాళహస్తిలో జనసేన రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేశారు. టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ వెంట కొట్టే సాయి, అసమ్మతి నేత మాజీ ఎమ్మెల్యే SCV నాయుడుకు అండగా కోటా వినుత, సైలెంట్‌గా అంజూరు చక్రధర్ ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. ఇక మదనపల్లిలోనూ మూడు గ్రూపులుగా జనసేన పనిచేస్తోంది. జనసేన రాయలసీమ కో కన్వీనర్ గా రాందాస్ చౌదరి ఒక గ్రూప్ గా, మై ఫోర్స్ మహేష్ మరో వర్గం, మూడో వర్గం జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత, రామాంజనేయులు మూడు పార్టీ ఆఫీసులతో హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే టిడిపి టికెట్, ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించినా శ్రీకాళహస్తి, మదనపల్లిలో జనసేన నేతలు టికెట్ కోసం పోటీ పడుతుండడం కూటమి కుంపటిని రాజస్తోంది. ఎవరికి వారుగా కార్యకలాపాలు చేస్తుండడంతో జనసేన నేతల మధ్య అంతర్గత పోరును చక్కదిద్దడంపై హై కమాండ్ విఫలం అయినట్టు గుర్తించింది. దీంతో జనసేనాని పవన్ కళ్యాణ్, నాగబాబు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని గ్రూపులకు చెక్ పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. కలిసి పని చేసి కూటమిని గెలిపించాలని ఆదేశిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




