Janasena: ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’పై జనసేన స్టాండ్ ఇదే.. ఢిల్లీ పెద్దలకు తేల్చి చెప్పిన నాదేండ్ల.. పవన్ ఏమన్నారంటే..?
Janasena: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తోన్న జమిలి ఎన్నికల ద్వారా దేశంలో ప్రజాధనం ఆదా అవుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే పార్లమెంటులోనూ జమిలి ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల దేశానికి కూడా మంచి జరుగుతుందన్నారు. వాస్తవానికి జమిలి ఎన్నికలపై ఎప్పటి నుంచో దేశంలో చర్చ జరుగుతోందని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ దాన్ని బలంగా ముందుకు
అమరావతి, సెప్టెంబర్ 2: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ విధానానికి తమ పార్టీ మద్దతిస్తోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన పీఏసీ సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ పెద్దలు జనసేన ఆధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో చర్చించారని అన్నారు. జమిలి ఎన్నికల ద్వారా దేశంలో ప్రజాధనం ఆదా అవుతుందని ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ తెలిపారు. అయితే పార్లమెంటులోనూ జమిలి ఎన్నికలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల దేశానికి కూడా మంచి జరుగుతుందన్నారు. వాస్తవానికి జమిలి ఎన్నికలపై ఎప్పటి నుంచో దేశంలో చర్చ జరుగుతోందని, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ దాన్ని బలంగా ముందుకు తీసుకొచ్చిందన్నారు.
జమిలి ఎన్నికల విధానాన్ని జనసేన స్వాగతిస్తుంది!
ఇవి కూడా చదవండి• ప్రజాధనం వృథా కాకుండా చేసే చర్యలు… మార్పు కోసం మంచివే
• త్వరలోనే వారాహి విజయ యాత్ర నాలుగో దశ
• శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజున సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక
• శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నచ్చేలా… pic.twitter.com/EAtJXkQTu6
— JanaSena Party (@JanaSenaParty) September 1, 2023
ఇక ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందన్నారు నాదెండ్ల మనోహర్. ఎన్నికల ద్వారా ఏపీలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామన్నారు.వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలని భావిస్తున్నామని నాదెండ్ల తెలిపారు. సెప్టెంబర్‌లోనే పవన్ కళ్యాణ్ మలివిడత వారాహి యాత్ర ఉంటుందన్నారు. త్వరలో దీని కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అలాగే ఏపీలో పొత్తులపైనా పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారన్నారు. ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అలాగే పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం, భవన నిర్మాణ కార్మికులతో కలసి సహపంక్తి భోజనం, రెల్లి కాలనీ వాసుల మధ్య పుట్టిన రోజు వేడుకలు, ఎస్సీ బాలుర వసతి గృహాలలో పెన్నులు, నోట్ బుక్స్ పంపిణీ, ప్రభుత్వ సహాయం అందని విభిన్న ప్రతిభా వంతులను దత్తత తీసుకొని వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతున్నామన్నారు.
కాగా, ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’పై పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. జమిలి ఎన్నికలు కావాలని గతంలో ఎందరో పేర్కొన్నారని, ప్రధాని మోదీ ఇదే ప్రస్తావనను తీసుకురావడం స్వాగతించాలని తెలిపారు. ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ విధానాన్ని ఎన్నో దేశాలు అమలు చేస్తున్నాయని, మన దేశంలో కూడా ఈ విధమైన ఎన్నికలను నిర్వహించడం వల్ల చాలా లాభాలున్నాయని, జనసేన దీనికి మద్ధతు తెలియజేస్తోందని పేర్కొన్నారు.
JanaSena Party Supports Hon'ble PM Shri Narendra Modiji's Proposal of "One Nation – One Election"@PMOIndia @PiyushGoyal @HMOIndia @JPNadda @blsanthosh @VMBJP pic.twitter.com/9dmyDHnVSF
— JanaSena Party (@JanaSenaParty) September 1, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..