YSRCP: బాపట్ల ‘సిద్దం’ సభ వాయిదా.. అసలు కారణం ఇదేనన్న ఎంపీ విజయసాయి రెడ్డి..
మార్చి 3న జరగాల్సిన సిద్ధం మహాసభ 10వ తేదీకి వాయిదా పడింది. దీనికి కారణం ఏంటి? ఈ ముగింపు సభా వేదికగా జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో జరిగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి వచ్చి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలను కూడా నాలుగు ప్రాంతాల్లో వేర్వేరుగా నిర్వహించాలని ప్రణాళికలు రచించారు. తొలి సభ ఉత్తరాంధ్రకు వేదికగా జరిగితే.. రెండవ సభ గోదావరి జిల్లాల్లో సాగింది.

మార్చి 3న జరగాల్సిన సిద్ధం మహాసభ 10వ తేదీకి వాయిదా పడింది. దీనికి కారణం ఏంటి? ఈ ముగింపు సభా వేదికగా జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఆంధ్రప్రదేశ్లో జరిగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి వచ్చి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఈ సభలను కూడా నాలుగు ప్రాంతాల్లో వేర్వేరుగా నిర్వహించాలని ప్రణాళికలు రచించారు. తొలి సభ ఉత్తరాంధ్రకు వేదికగా జరిగితే.. రెండవ సభ గోదావరి జిల్లాల్లో సాగింది. మూడవ సభ రాయలసీమ జిల్లాల్లో నిర్వహించారు. నాల్గవ సభ కోస్తాంధ్ర ప్రాంతాల్లో నిర్వహించాలని భావిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలను యాక్టీవ్ చేసే ఆలోచనలో ఉన్నారు. పైగా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నందున అన్ని ప్రాంతాల్లో వైసీపీ బలాన్ని చూపించుకునేందుకు అవకాశం ఉంటుందని దీనికి శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటికే మూడు ప్రాంతాల్లో నిర్వహించిన సభకు లక్షలాది మంది వాలంటీర్లు, కార్యకర్తలు తరలి వచ్చారు. వారికి సీఎం జగన్ రానున్న ఎన్నికల్లో ఎలా నడుచుకోవాలో మార్గనిర్ధేశం చేశారు. మార్చి 3న బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా సిద్దం సభ నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీ తలపెట్టిన సిద్ధం ముగింపు సభ మార్చి 10కి వాయిదా పడింది. దీనిపై రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పందించారు.
సిద్ధం సభలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. మేదరమెట్ల సభకు వచ్చేందుకు ఇప్పటికే 7 లక్షల మందికి పైగా సంసిద్ధత తెలిపారన్నారు. మొత్తంగా 15 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నాట్లు తెలిపారు. సిద్ధం సభలోపే అన్ని సీట్లు ప్రకటిస్తామన్నారు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఇప్పటికే 8 జాబితాల్లో నియోజకవర్గ ఇన్చార్జిలను ప్రకటించిన వైసీపీ రానున్న రోజుల్లో మరిన్ని స్థానాలకు అభ్యర్థులను నియమించే అవకాశం కనిపిస్తోంది. అలాగే మేనిఫెస్టోపై తీవ్రమైన కసరత్తు జరుగుతోంది. గతంలో ఇచ్చిన సంక్షేమాలకంటే మరిన్ని అదనంగా జోడించి త్వరలోనే సరికొత్త మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా ప్రజలు తమవైపు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. మార్చి13, లేదా 14 తేదీల్లో ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏప్రిల్ రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారాయన. బాపట్లలో నిర్వహించే సిద్ధం సభ 98 ఎకరాల సువీశాల ప్రాంగణం ఏర్పాటు చేశామన్నారు. పార్కింగ్ ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని పరిశీలించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి వచ్చే పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదేళ్ల పాలన గురించి వివరిస్తూనే.. ఎన్నికల్లో కేడర్ ఎలా వ్యవహరించాలనే దానిపై కార్యకర్తలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు విజయసాయి రెడ్డి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








