Srisailam Brahmotsavam: రేపటి నుంచి 11వరకు మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఏ రోజున ఏ సేవలు జరగనున్నయంటే..

శ్రీశైలం వచ్చిన భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. టూరిస్ట్ బస్టాండు వద్ద వాహనాల పార్కింగ్ కు పెద్దపెద్ద గ్రౌండ్లను అదనంగా ఉంచారు, శివదీక్ష శిబిరాలు, ఆలయ ముందు భాగంలో భక్తులు విశ్రాంతి కోసం భారి టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చె భక్తులకు మంచినీరు అందించేందుకు నుతన వాటర్ ట్యాంక్ లు ఫీల్టర్ హౌస్ లను నిర్మించారు. అందులో‌ నుంచి త్రాగేందుకు ఫిల్టర్ వాటర్ ను ఏర్పాటు చేశారు. పాతాళగంగ వద్ద మహిళలు పిల్లలు పెద్దలు పుణ్య స్నానాలు ఆచరించేందుకు అణువుగా బారికెడ్లు పెన్సింగ్ పనులు చేపడుతున్నారు.

Srisailam Brahmotsavam: రేపటి నుంచి 11వరకు మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఏ రోజున ఏ సేవలు జరగనున్నయంటే..
Mallanna Brahmotsavam On March 1st
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Feb 29, 2024 | 12:37 PM

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రేపటి నుంచి ( మార్చి 1వ తేదీ నుంచి) 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆలయం గోపురాలు విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతోంది. దేవతామూర్తుల విగ్రహాలకు తుది మెరుగులు రూపుదిద్దుకుంటున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చె భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేసేందుకు దేవస్థానం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేక క్యూలైన్లు మంచినీరు, భోజనం వసతి తదితర భారీ ఏర్పాట్ల పనులపై అధికారులు నిమగ్నమయ్యారు.

ఇరుముడి ధరించిన శివస్వాములు

అష్టాదశ శక్తి పీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలసి వెలసిన శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి మార్చి 11 వరకు 11 రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబయ్యింది. క్షేత్ర పరిధిలో ప్రధాన గోపురాలు విద్యుత్ కాంతులతో మిలమిల మెరిసిపోతుంది. విద్యుత్ కాంతుల నడుమ ఆలయం సర్వాంగసుందరంగ ముస్తాబయింది. 11 రోజులపాటు స్వామి అమ్మవార్లు ప్రతిరోజూ రోజుకోక్క వాహనంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ పరిధిలోని దేవతా మూర్తుల విగ్రహాలకు నూతన రంగులతో చూడగానే ముచ్చటగొలుపే విధంగా రూపుదిద్దుతున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు శివస్వాములు భారీగా తరలివస్తున్నారు. శివస్వాములతో క్షేత్రం శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. రేపటి నుంచి 11వ తేదివరకు భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు ఆలయంలో స్వామివారి గర్భాలయం స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే శివస్వాములు ఇరుముడి ధరించిన శివస్వాములకు మాత్రమే మార్చి ఐదు వరకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుందని ఈఓ పెద్దిరాజు తెలిపారు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

భక్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలి వస్తున్నారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు వసతి శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రసాదం తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి భక్తులు ఐదురోజుల ముందు నుంచే పాదయాత్రతో శ్రీశైలం తరలివస్తారు. వారికోసం శ్రీశైలానికి 10 కిలోమీటర్లు దూరంలోని కైలాశద్వారం మెట్ల మార్గంలోని వచ్చే భక్తులు సేద తీరేందుకు భారీ షెడ్లు టెంట్లు శామియానాలు ఏర్పాటు చేశారు. తాగేందుకు మంచినీటి ట్యాంకర్లు వాటర్ ట్యాంక్ లను సిద్దం చేశారు.

ఇవి కూడా చదవండి

శ్రీశైలం వచ్చిన భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు అదనపు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. టూరిస్ట్ బస్టాండు వద్ద వాహనాల పార్కింగ్ కు పెద్దపెద్ద గ్రౌండ్లను అదనంగా ఉంచారు, శివదీక్ష శిబిరాలు, ఆలయ ముందు భాగంలో భక్తులు విశ్రాంతి కోసం భారి టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చె భక్తులకు మంచినీరు అందించేందుకు నుతన వాటర్ ట్యాంక్ లు ఫీల్టర్ హౌస్ లను నిర్మించారు. అందులో‌ నుంచి త్రాగేందుకు ఫిల్టర్ వాటర్ ను ఏర్పాటు చేశారు. పాతాళగంగ వద్ద మహిళలు పిల్లలు పెద్దలు పుణ్య స్నానాలు ఆచరించేందుకు అణువుగా బారికెడ్లు పెన్సింగ్ పనులు చేపడుతున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు సఖల ఏర్పాట్లు చేసేందుకు అధికారులు శరవేగంగ ఏర్పట్ల పనులను దగ్గర ఉండి పనులను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన పనులపై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్ ఎస్పీ రఘువీర్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ చైర్మన్, సభ్యులు సంయుక్తంగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఏర్పాట్లు పనులు ముమ్మరం చేశారు. భక్తుల కోసం సుమారు 30 లక్షల లడ్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు‌ కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పటికే దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని మిగిలిన పనులు మరో రెండు రోజులలో పూర్తి చేస్తామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలు ముఖ్య కార్యక్రమాలు

  1. మార్చి 1 యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం సాయంత్రం ధ్వజారోహణ
  2. మార్చి 2 వ తేదీన భృంగివాహన సేవ
  3. మార్చి 3 వ తేదీన హంసవాహనసేవ.
  4. మార్చి 4 వతేదీన మయూరవాహనసేవ,
  5. మార్చి 5 వతేదీన రావణవాహన సేవ
  6. మార్చి 6 వతేదీన పుష్పపల్లకీ సేవ
  7. మార్చి 7 వతేదీన గజవాహనసేవ
  8. మార్చి 8 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నందివాహనసేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాగాలంకరణ,శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం
  9. మార్చి 9 వతేదీన స్వామి అమ్మవారికి రథోత్సవం రాత్రి తెప్పోత్సవం
  10. మార్చి 10 వ తేదీన యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
  11. మార్చి 11 వ తేదీన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం బ్రహ్మోత్సవాలు ముగింపు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..