Ayodhya: ఇక నుంచి అయోధ్య హనుమాన్ ప్రసాదాన్ని ఇంటి నుంచే పొందండి.. పూర్తి వివరాలు మీ కోసం..

భారతదేశం అంతటా శ్రీ హనుమాన్ గర్హి దేవాలయం ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా అందజేయనుంది పోస్టల్ శాఖ. భక్తులు తమకు సమీపంలోని పోస్టాఫీసుకు ఈ-మనీ ఆర్డర్ పంపడం ద్వారా ప్రసాదాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఇదే విషయంపై వారణాసి, ప్రయాగ్‌రాజ్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ స్పందిస్తూ దేశంలోని ఏ మూలన ఉన్న భక్తులైనా స్పీడ్ పోస్ట్ సర్వీస్ ద్వారా శ్రీ హనుమాన్ గర్హి ఆలయ ప్రసాదాన్ని ఇంటి వద్దకే పొందవచ్చు అని వెల్లడించారు.

Ayodhya: ఇక నుంచి అయోధ్య హనుమాన్ ప్రసాదాన్ని ఇంటి నుంచే పొందండి.. పూర్తి వివరాలు మీ కోసం..
Prasad Home Delivery
Follow us

|

Updated on: Feb 29, 2024 | 11:02 AM

రామ జన్మభూమి అయోధ్యలో ప్రముఖ ఆలయాల్లో ఒకటి హనుమాన్ గడి దేవాలయం. బాల రామయ్య గర్భ గుడిలో కొలువుదీరిన తర్వత అయొధ్యకు భారీ సంఖ్యలో భక్తులు పోటేత్తుతున్నారు. దీంతో అయోధ్య క్షేత్రంలోని ప్రముఖ దేవాలయాలలో కూడా రద్దీ నెలకొంది. ముఖ్యంగా రామ భక్త హనుమానుని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో హనుమన్ ప్రసాదాన్ని దేశ వ్యాప్తంగా ఇక నుంచి అందించడానికి పోస్టల్ శాఖ కసరత్తు చేసింది.

భారతదేశం అంతటా శ్రీ హనుమాన్ గర్హి దేవాలయం ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా అందజేయనుంది పోస్టల్ శాఖ. భక్తులు తమకు సమీపంలోని పోస్టాఫీసుకు ఈ-మనీ ఆర్డర్ పంపడం ద్వారా ప్రసాదాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఇదే విషయంపై వారణాసి, ప్రయాగ్‌రాజ్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ స్పందిస్తూ దేశంలోని ఏ మూలన ఉన్న భక్తులైనా స్పీడ్ పోస్ట్ సర్వీస్ ద్వారా శ్రీ హనుమాన్ గర్హి ఆలయ ప్రసాదాన్ని ఇంటి వద్దకే పొందవచ్చు అని వెల్లడించారు.

శ్రీ హనుమాన్ గడి దేవాలయం ప్రసాద ప్యాకేజీ

అయోధ్యలోని శ్రీ హనుమాన్ గర్హి ఆలయానికి చెందిన తపాలా శాఖ, సంకటమోచన సేన ట్రస్ట్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. దేశంలోని ఏ మూలలో నివసించే భక్తులైనా స్పీడ్ పోస్ట్ ద్వారా శ్రీ హనుమాన్ గర్హి ఆలయ ప్రసాదాన్ని ఆర్డర్ చేయవచ్చని యాదవ్ చెప్పారు. అంతేకాదు డబ్బులను పంపించాడానికి చిరునామా కూడా ఇచ్చారు. ‘సబ్ పోస్ట్‌మాస్టర్, అయోధ్యధామ్ –224123’ పేరుతో సమీప పోస్టాఫీసు నుండి రూ. 251 లేదా రూ. 551 లను ఇ-మనీ ఆర్డర్ మాత్రమే పంపాలని చెప్పారు. ఈ-మనీ ఆర్డర్ అందిన వెంటనే, ప్రసాదం స్పీడ్ పోస్ట్ ద్వారా తపాలా శాఖ ఇచ్చిన చిరునామాకు పంపబడుతుందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రూ. 251లు చెల్లించిన భక్తులకు సంకటమోచన ప్రసాదంలో లడ్డూలు, హనుమంతుడి చిత్రం, మహావీర గంధం, అయోధ్య దర్శనానికి సంబంధించిన పుస్తకం ఉంటాయని తెలిపారు. రూ. 551లు చెల్లించే భక్తులకు మహావీర ప్రసాదంలో లడ్డూలు, హనుమంతుడి చిత్రం, మహావీర చందనం, పుస్తకం తో పాటు అయోధ్య దర్శననికి సంబంధించిన పుస్తకంతో పాటు, తులసి మాల, హనుమాన్ యంత్రం ఉంటాయని చెప్పారు.

భక్తులు తమ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా స్పీడ్ పోస్ట్ వివరాలను పొందే విధంగా పోస్టల్ శాఖ కూడా ఏర్పాట్లు చేసినట్లు యాదవ్ తెలిపారు. ఇందుకోసం ఈ-మనీ ఆర్డర్‌లో తమ పూర్తి చిరునామా, పిన్ కోడ్, మొబైల్ నంబర్ రాయడం తప్పనిసరని పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..