Mallanna Temple: రోజు రోజుకీ పెరుగుతున్న మల్లన్న హుండీ ఆదాయం.. ఈసారి నగదుతో పాటు భారీగా బంగారు, వెండి, విదేశీ కరెన్సీ

గత 49 రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ తెలిపారు. ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా 398 గ్రాముల 800 మిల్లీ గ్రాముల బంగారం, 7 కేజీల 950 గ్రాముల వెండి లభించాయి. ఈ హుండీ లెక్కింపులో మన దేశ కరెన్సీతో పాటు పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు.

Mallanna Temple: రోజు రోజుకీ పెరుగుతున్న మల్లన్న హుండీ ఆదాయం.. ఈసారి నగదుతో పాటు భారీగా బంగారు, వెండి, విదేశీ కరెన్సీ
Srisailam Hundi Collection
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Feb 29, 2024 | 9:26 AM

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ శివయ్య తన దేవేరి పార్వతితో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిగా కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశంలో అనేక ప్రాంతాల నుంచి మల్లన్న దర్శనానికి పోటెత్తుతున్నారు. తాజాగా అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 5 ,62,30,472 రూపాయల నగదు లభించింది. ఈ ఆదాయాన్ని గత 49 రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ తెలిపారు.

ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా 398 గ్రాముల 800 మిల్లీ గ్రాముల బంగారం, 7 కేజీల 950 గ్రాముల వెండి లభించాయి. ఈ హుండీ లెక్కింపులో మన దేశ కరెన్సీతో పాటు పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు. అందులో యుఎస్ఏ డాలర్లు 1989, ఆస్ట్రేలియా డాలర్లు 30, కెనడా డాలర్లు 305, ఇంగ్లాండ్ ఫౌండ్స్ 25, యూ ఏ ఈ ధీరంస్ 30, సింగపూర్ డాలర్లు 56, యూరోస్ 60, కువైట్ దినార్ 10, కత్తర్ రియాల్స్ 15 మొదలైన వివిధ విదేశీ కరెన్సీలు కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణమ్మ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..