AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri 2024: శివ పురాణం ప్రకారం శివ రాత్రి రోజున ఉపవాసం చేసే పద్దతి, ప్రాముఖ్యత ఏమిటంటే..

శివపురాణం ప్రకారం, ఒక రోజు పార్వతిదేవి శివయ్యతో మాట్లాడుతూ.. మీ భక్తులకు ఏ వ్రతాన్ని అసచారిస్తే మీరు తృప్తి చెంది.. మోక్షాన్ని అందిస్తారని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, దేవీ నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ఉపవాసాలు మరియు పూజలు చేస్తారు. అయితే వేదాలు తెలిసిన వ్యక్తులు భక్తులు ఉపవాసం శ్రేష్టమైనది అని భావిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో పది నియమాలున్నాయి.

Mahashivratri 2024: శివ పురాణం ప్రకారం శివ రాత్రి రోజున ఉపవాసం చేసే పద్దతి, ప్రాముఖ్యత ఏమిటంటే..
Lord Shiva Puja
Surya Kala
|

Updated on: Feb 29, 2024 | 9:15 AM

Share

దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శివుడు, శివ భక్తులకు ఈ రోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివభక్తులందరూ తమ తమ శక్తిని బట్టి భక్తితో పూజిస్తారు. అయితే శివపురాణంలో మహాశివరాత్రి ఉపవాస నియమాలు కొన్ని ప్రత్యేక పద్ధతిలో వివరించబడ్డాయి. దీని కారణంగా త్రినేత్రుడైన శివుడు ప్రసన్నుడవుతాడు. అంతేకాదు వ్యక్తి జీవితంలోని కష్టాల నుండి విముక్తి పొందుతాడు.. మోక్షం లభిస్తుందని విశ్వాసం.

శివపురాణం ప్రకారం, ఒక రోజు పార్వతిదేవి శివయ్యతో మాట్లాడుతూ.. మీ భక్తులకు ఏ వ్రతాన్ని అసచారిస్తే మీరు తృప్తి చెంది.. మోక్షాన్ని అందిస్తారని అడిగింది. అప్పుడు శివుడు ఇలా అన్నాడు, దేవీ నన్ను ప్రసన్నం చేసుకోవడానికి చాలా మంది ఉపవాసాలు మరియు పూజలు చేస్తారు. అయితే వేదాలు తెలిసిన వ్యక్తులు భక్తులు ఉపవాసం శ్రేష్టమైనది అని భావిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో పది నియమాలున్నాయి. అవి చాలా ముఖ్యమైనవి. ఈ ఉపవాసాల నియమాలను మీకు చెప్తాను. వీటిని పాటించడం వలన తన అనుగ్రహంతో శివైక్యం పొందుతారని చెప్పారు.

ప్రతి నెల అష్టమి రోజు ఉదయం ఉపవాసం మొదలు పెట్టి రాత్రి సమయంలో ఉపవాసం విరమించుకుని.. ఆహారం తీసుకోవాలి. అయితే కాలాష్టమి నాడు రాత్రి కూడా ఆహారం తీసుకోకూడదు. పగటిపూట ఉపవాసం ఉండండి రాత్రి తినండి. అలాగే శుక్ల పక్షంలోని ఏకాదశి రోజు రాత్రి భోజనం చేయకూడదు. అదేవిధంగా శుక్ల పక్షంలోని త్రయోదశి నాడు రాత్రి పూట ఉపవాసం చేయాలి.. అదే కృష్ణ పక్షంలోని త్రయోదశి రోజున ఆహారం తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి

మహాశివరాత్రి ఉపవాస ఆచారాలు

ప్రతి నెలా వచ్చే శివరాత్రి ఉపవాసాలలో మహాశివరాత్రి పర్వదినం ఉత్తమమైనది. ఇది మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వస్తుంది. శివపురాణం ప్రకారం, ఈ రోజున, తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి శివాలయానికి వెళ్లి శివుని పూజించండి. పూజించేటప్పుడు నేను శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని శివుడిని ప్రార్థించండి. తన ఉపవాసంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని శివుడిని కోరుకోవాలి. అప్పుడు కామము, క్రోధము, శత్రువులు మొదలగునవి భక్తుల దరిచేరవు. అంతేకాదు శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ భక్తులపై నిలిచి ఉంటాయి.

ఉపవాసం, ఉద్యాపన పద్ధతి

  1. శివుని ముందు ఉపవాస దీక్ష తీర్మానం చేసిన తర్వాత రాత్రిపూట అన్ని పూజా సామాగ్రిని సేకరించి నియమాల ప్రకారం శివలింగాన్ని ప్రతిష్టించిన శివాలయానికి వెళ్లండి.
  2. ఆలయానికి వెళ్లి శివుడిని పూజించి, 108 సార్లు శివ మంత్రాలను జపిస్తూ శివునికి నీటితో అభిషేకం చేయండి.
  3. మహాశివరాత్రి రోజున గురు మంత్రాన్ని పఠిస్తూ శివుడికి నల్ల నువ్వులను సమర్పించండి.
  4. శివుని ఎనిమి పేర్లైన భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహా తే దేవాయ నమః, అంటూ ఈ ఎనిమిది పేర్లతో ఉన్న నామాలను పఠిస్తూ తామర, గన్నేరు పుష్పాలను సమర్పించండి.
  5. తర్వాత ధూప, దీప, పూజ సామాగ్రితో పూజించాలి. ఆ తర్వాత ధనుముద్రను చూపుతూ నీళ్లను నైవేద్యంగా సమర్పించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..