ముక్కు పుడక: భారతీయ స్త్రీ అలంకారంలో ముక్కు పుడక కూడా వెరీవెరీ స్పెషల్. దక్షిణ భారత దేశంలో చిన్న తనంలోనే అమ్మాయిలకు ముక్కు కుట్టిస్తారు. ఇక పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలలో స్త్రీలు ముక్కుకు రకరకాల ముక్కు పుడకలను ధరిస్తారు. వివాహిత స్త్రీలు ముక్కుపుడక పెట్టుకుంటే భర్త ఆరోగ్యం బాగుంటుందని, ఇల్లు సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. శాస్త్రీయ దృక్కోణంలో చూస్తే ముక్కు పుడక ధరించడం నేరుగా స్త్రీ గర్భాశయానికి సంబంధించినది. బంగారు ముక్కు పుడక లేదా నోస్ రింగ్ ధరించడం వల్ల గర్భధారణ, డెలివరీ సమయంలో సమస్యలు తగ్గుతాయి.