- Telugu News Photo Gallery Cinema photos Malavika Mohanan latest wedding shoot photos goes viral in social media
Malavika Mohanan: గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మలయాళ కుట్టి
హీరోయిన్ సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలో కొనసాగాలంటే గ్లామర్, టాలెంట్‌తో పాటు సోషల్ మీడియాని వాడుకోవటం కూడా కాస్త తెలిసుండాలి. అప్పుడే ఆఫర్స్‌తో సంబంధం లేకుండా ఆన్‌లైన్ ట్రెండ్స్‌లో కనిపిస్తుంటారు. ఈ ఫార్ములాను పర్ఫెక్ట్‌గా వంట పట్టించుకున్నారు ఓ మలయాళ కుట్టి. హీరోయిన్ సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలో కొనసాగాలంటే గ్లామర్, టాలెంట్‌తో పాటు సోషల్ మీడియాని వాడుకోవటం కూడా కాస్త తెలిసుండాలి. అప్పుడే ఆఫర్స్‌తో సంబంధం లేకుండా ఆన్‌లైన్ ట్రెండ్స్‌లో కనిపిస్తుంటారు. ఈ ఫార్ములాను పర్ఫెక్ట్‌గా వంట పట్టించుకున్నారు ఓ మలయాళ కుట్టి.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Feb 29, 2024 | 12:43 PM

హీరోయిన్ సక్సెస్‌ఫుల్‌గా ఇండస్ట్రీలో కొనసాగాలంటే గ్లామర్, టాలెంట్‌తో పాటు సోషల్ మీడియాని వాడుకోవటం కూడా కాస్త తెలిసుండాలి. అప్పుడే ఆఫర్స్‌తో సంబంధం లేకుండా ఆన్‌లైన్ ట్రెండ్స్‌లో కనిపిస్తుంటారు. ఈ ఫార్ములాను పర్ఫెక్ట్‌గా వంట పట్టించుకున్నారు ఓ మలయాళ కుట్టి.

కెరీర్‌లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా వరుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న బ్యూటీ మాళవిక మోహనన్. ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్స్‌తో బిగ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ, సినిమా అప్‌డేట్స్ కన్నా... తన సోషల్ మీడియా పోస్ట్‌లతోనే ఎక్కువగా ట్రెండ్‌లో కనిపిస్తున్నారు.

మాస్టర్, మారన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన మాళవికకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. అందుకే అవకాశాల కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్‌తో స్పీడు పెంచారు. ఈ ప్లాన్ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో మాళవిక పేరు యాడ్ అయ్యింది.

ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవ్వటం ఎలా అన్నది మాళవికకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలీదేమో...? తాజాగా ఓ వెడ్డింగ్ ఈవెంట్‌కు అటెండ్ అయిన మాళవిక... అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి 'ఇది నా పెళ్లి కాదు' అంటూ కామెంట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ పోస్ట్ వైరల్ అయ్యింది.

ఈ బ్యూటీ విక్రమ్‌కు జోడిగా నటించిన తంగలాన్ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ ది రాజా సాబ్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు మాళవిక. ఈ రెండు సినిమాలతో స్టార్ లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తానన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మరి ఇప్పటికైనా సోషల్ మీడియా రేంజ్‌లో సిల్వర్ స్క్రీన్ ఇమేజ్ క్రియేట్ అవుతుందేమో చూడాలి.





























