YSRCP: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వేగం పెంచిన సీఎం జగన్.. మ్యానిఫెస్టోపై కీలక సమావేశం..
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ముందే రాజకీయం రసవతరంగా మారింది. ఫిబ్రవరి 29 గురువారం మధ్యాహ్నం 3గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టో పై సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సిద్దం పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీఎం జగన్ మరో కీలక అంశంపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలైనప్పటి నుంచి ఏపీలో రాజకీయ వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు ముందే రాజకీయం రసవతరంగా మారింది. ఫిబ్రవరి 29 గురువారం మధ్యాహ్నం 3గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టో పై సీఎం జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సిద్దం పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీఎం జగన్ మరో కీలక అంశంపై ఫోకస్ పెట్టారు. ఒకవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదలైనప్పటి నుంచి ఏపీలో రాజకీయ వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పైగా ఈరోజు తాడేపల్లిలో వైసీపీ మ్యానిఫెస్టోపై సీఎం జగన్ పార్టీ సీనియర్ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 8 జాబితాల్లో నియోజకవర్గ ఇంచార్జులను ప్రకటించి ముందుకు వెళ్తున్న వైసీపీ మ్యానిఫెస్టోపై దృష్టిపెట్టింది. గతంలో ప్రకటించి అమలు చేసిన నవరత్నాలుతో పాటు, కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీని మేనిఫెస్టో పెట్టె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సీనియర్ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. అంతేకాకుండా ఈసారి మహిళల కోసం మరిన్ని కొత్త పథకాలు అమలుపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
వైనాట్ 175 అని భారీ లక్ష్యంతో అభ్యర్థులను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్ ఈసారి రాజకీయ వ్యూహాలకు పదును పెంచారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. గతపాలనలో సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిన సీఎం జగన్ ఈసారి కూడా దానిని అధారంగా చేసుకునే అర్హులకు మరింత లబ్ధి చేకూర్చాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ అంటూ కొన్ని పథకాలను ప్రకటించింది. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మాజీ మంత్రి లోకేష్ మొన్న జరిగిన బహిరంగ సభలో కార్యకర్తలకు దిశానిర్థేశం చేశారు. ఈ క్రమంలోనే సూపర్ సిక్స్ కు ధీటుగా తమ మ్యానిఫెస్టోను రూపొందించాలనే ఆలోచనతో సీఎం జగన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాంటి పథకాలు అందించనున్నారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








