MP Avinash Reddy: సీబీఐ-ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖలపర్వం.. లక్ష్మమ్మ ఆరోగ్యంపై ఉత్కంఠ..
వైఎస్ వివేకా మర్డర్ కేసు.. ఊహించని మలుపులు తిరుగుతోంది. సీబీఐ-ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖలపర్వం కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డి పిటిషన్ మెన్షన్ చేసే క్రమంలోనూ హైడ్రామా చోటు చేసుకుంది. అటు ఆస్పత్రిలో ఉన్న అవినాష్‌రెడ్డి తల్లిని పరామర్శించారు వైఎస్ విజయలక్ష్మి.
వివేకా హత్య కేసులో సీబీఐ-ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖలపర్వం కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో అవినాష్‌రెడ్డి పిటిషన్ మెన్షన్ చేసే క్రమంలోనూ వాదనలు ఉత్కంఠ రేపాయి. అటు ఆస్పత్రిలో ఉన్న అవినాష్‌రెడ్డి తల్లిని పరామర్శించారు వైఎస్ విజయలక్ష్మి. ఇవాళ రోజంతా కర్నూల్లో హైటెన్షన్ నెలకొంది. తన తల్లి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 27 వరకు విచారణకు మినహాయింపు ఇవ్వాలని CBI అడిషనల్ ఎస్పీ ముఖేష్‌శర్మకు లేఖ రాశారు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి. 27 తర్వాతే విచారణకు అందుబాటులో ఉంటానన్నారు. లేఖతోపాటు మెడికల్ రిపోర్టులు పంపించారు ఎంపీ. సోమవారం నాటి విచారణకు వెళ్లలేదు. ఇంకోవైపు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ఎదుట అవినాష్‌రెడ్డి లాయర్లు మెన్షన్ చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
వివేకా హత్య కేసులో సీబీఐ – ఎంపీ అవినాష్ రెడ్డి మధ్య లేఖలపర్వం కొనసాగుతోంది. లేటెస్ట్‌గా మరోసారి సీబీఐకి లేఖ రాసిన అవినాష్.. విచారణకు కొంత సమయం కావాలని కోరారు. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని.. ఆ పిటిషన్‌పై రేపు విచారణ జరుగుతుందని లేఖలో అవినాష్ ప్రస్తావించారు. మరోవైపు తన తల్లి అనారోగ్యం దృష్య్టా ఈనెల 27తర్వాత విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు.
అయితే సీబీఐ అధికారులు మాత్రం అవినాష్ విఙ్ఞప్తిని పట్టించుకోలేదు. ఇవాళ ఉదయమే రెండు కార్లలో కర్నూలు చేరుకున్నారు. అవినాష్‌కు ఇచ్చిన నోటీసులపై జిల్లా ఎస్పీతో చర్చించారు. ఇక అవినాష్ తల్లికి కర్నూలులోని విశ్వ భారతి ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. మరోవైపు అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మెన్షనింగ్ లిస్ట్‌లో ఉంటేనే విచారిస్తామని.. జడ్జిలు సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ ధర్మాసనం వెల్లడించింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని న్యాయమూర్తి అనిరుథ్ బోస్ ధర్మాసనం సూచించింది. ఈ క్రమంలోనే రెండోసారి సీబీఐకి లేఖ రాశారు అవినాష్ రెడ్డి.
ఇదే సమయంలో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్‌బులెటిన్ విడుదల చేశారు. ఆమె మరికొన్ని రోజులు ఐసీయూలోనే ఉండాలని, వివిధ పరీక్షలు చేయాల్సి ఉందని బులెటిన్లో ప్రస్తావించారు. ఇంకోవైపు ఎంపీ అనుచరులు..
వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. సీబీఐ అధికారులు కూడా కర్నూలులోనే ఉండటంతోఎప్పుడేం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగింది. సీబీఐ అత్యుత్సాహం చూపిస్తోంది మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఆస్పత్రి పరిసరాల్లో మాత్రం బారికేడ్లు ఏర్పాటు చేసి.. అటుగా రాకపోకలపై ఆంక్షలు విధించారు పోలీసులు.
ఈ ఇష్యూ ఇప్పుడు కర్నూలు కేంద్రంగా కాక రేపుతోంది. అవినాష్ లెటర్స్‌కు సీబీఐ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం