Child Marriages: పుస్తకాలు పట్టుకునే వయసులోనే పుస్తెల తాడు.. బాల్య వివాహాల్లో ఏపీ టాప్.. తెలంగాణ ఏ స్థానంలో ఉందంటే..
Child Marriages: చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసే అంశంపై దేశవ్యాప్తంగా జరిపిన ఓ సర్వేలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా..
Child Marriages: దేశం పురోగమిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఆకాశానికి వెళుతున్నారు. అయినా కొన్ని సామాజిక దురాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా బాల్య వివాహాలు ఏ మాత్రం తగ్గడం లేదు. పుస్తకాలు పట్టుకునే వయసులోనే అమ్మాయిల మెడలో పుస్తెల తాడులు పడుతున్నాయి. ఈక్రమంలో చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసే అంశంపై దేశవ్యాప్తంగా జరిపిన ఓ సర్వేలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్మొదటి స్థానంలో నిలిచింది. ఏపీలో ఎక్కువగా చిన్న వయస్సులోనే అమ్మాయిలకు పెళ్లి తంతు ముగించేసి, తల్లిదండ్రులు వారిని అత్తారింటికి పంపేస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5) లో వెల్లడైంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా, కేరళ రాష్ట్రం చివరి స్థానంలో నిలిచింది.
కరోనా కారణంగా..
2019 జులై 5వ తేదీ నుంచి నవంబర్14వ తేదీ వరకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జరిగింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లోని సుమారు 11,346 ఇళ్లను ఈ సర్వే బృందం కలిసింది. NFHS-4 సర్వే (33 శాతం)తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ వయస్సు గల వివాహాల రేటు 29.3 శాతానికి తగ్గింది. అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే ఇప్పటికీ అత్యధికం. ఏపీలోని కొన్ని జిల్లాల్లో NFHS-4తో పోలిస్తే NFHS-5లో బాల్య వివాహాల శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 15-19 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఇప్పటికే తల్లులుగా మారిన అనేక కేసులె కూడా ఈ సర్వేలో వెలుగుచూశాయి. ఇక ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టిన కొవిడ్19 మహమ్మారితో కూడా రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిందని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అధికారులు చెబుతున్నారు. అనంతపురం, ప్రకాశం జిల్లాలు 37.3 శాతంతో అత్యధికంగా తక్కువ వయసు గల వివాహాల రేటును నమోదు చేయగా.. కర్నూలు 36.9 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక 23.5 శాతంతో తక్కువ వయసు గల వివాహాల రేటుతో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటక 21.3 శాతంతో మూడో స్థానంలో..తమిళనాడు 12.8 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాయి. కేరళలో అతి తక్కువగా 6.3 శాతం మాత్రమే చిన్నారుల పెళ్లిళ్లు జరిగినట్లు ఈ సర్వేలో తేలింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: