AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie: ఊపేసిన అనిల్‌ రావిపూడి.. పార్టీ సాంగ్‌తో తనదైన స్టెప్పులతో..

Anil Ravipudi: అయితే ఈ పార్టీ సాంగ్‌లో నేను కూడా ఉన్నానంటూ అనిల్‌ రావిపూడి ఆశ్చర్యపరిచాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేశాడు. 'మీరు కచ్చితంగా కుడివైపు ఉన్న వరుణ్‌తేజ్‌, పూజా హెగ్డేనే చూసుంటారు.

F3 Movie: ఊపేసిన అనిల్‌ రావిపూడి.. పార్టీ సాంగ్‌తో తనదైన స్టెప్పులతో..
F3
Basha Shek
|

Updated on: May 18, 2022 | 10:10 PM

Share

Anil Ravipudi: కల్యాణ్‌ రామ్ నటించిన పటాస్‌ సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు అనిల్‌ రావిపూడి. ఆతర్వాత సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా స్ర్కీన్‌ప్లే రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా సత్తా చాటుతున్నాడీ యంగ్‌ డైరెక్టర్‌. కాగా దగ్గుబాటి హీరో వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌లను హీరోలుగా పెట్టి ఆయన నిర్మించిన చిత్రం ఎఫ్‌2. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు ఆ డోస్‌ను మరింత పెంచేందుకు ఎఫ్‌3 ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు అనిల్‌. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో స్పీడ్‌ చేసిన చిత్రబృందం ఇటీవలే పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అంటూ ఓ పాటను విడుదల చేసింది. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అప్పిరియన్స్ తో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలసి సందడి చేయబోతున్న ఈ పాట అంచనాలని పెంచేసింది. ఈ పాటలో బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ అప్పియరెన్స్‌ ఇచ్చింది. వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలసి ఆమె వేసిన స్టెప్పులు సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సాంగ్‌లో పూజ పక్కన వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ మాత్రమే ఉన్నారని అందరూ భావించారు. అయితే ఈ పార్టీ సాంగ్‌లో నేను కూడా ఉన్నానంటూ అనిల్‌ రావిపూడి ఆశ్చర్యపరిచాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్‌ చేశాడు. ‘మీరు కచ్చితంగా కుడివైపు ఉన్న వరుణ్‌తేజ్‌, పూజా హెగ్డేనే చూసుంటారు. లెఫ్ట్‌లో మనం కూడా ఉన్నాం’ అంటూ దీనికి క్యాప్షన్‌ ఇచ్చాడు.

ఇందులో వరుణ్‌, పూజలతో పాటు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాలో సొనాల్‌ చౌహాన్‌, సునీల్‌ కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు మురళీ శర్మ,అలీ, రాజేంద్రప్రసాద్‌, ఝాన్సీ, ప్రగతి, అన్నపూర్ణ, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించిన బాణీలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. మరి ఇన్ని ప్రత్యేకతలతో వస్తోన్న ఈ చిత్రం ఏ మేర కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Major Movie: మేజర్‌ సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న ‘ఓ ఇషా’ రొమాంటిక్‌ సాంగ్‌..

CM KCR AND VIJAY: సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌.. రాజకీయ చర్చకు దారి తీసిన భేటీ!

Rajeev Chandrasekhar: సైబర్‌ సెక్యూరిటీ విషయంలో వెనక్కు తగ్గేదేలే.. త్వరలోనే డేటా ప్రొటెక్షన్‌ బిల్లు అమల్లోకి : కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్