Major Movie: మేజర్‌ సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న ‘ఓ ఇషా’ రొమాంటిక్‌ సాంగ్‌..

Major Movie: మహేష్ బాబు (Mahesh Babu) సొంత బ్యానర్ సంస్థ జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది.

Major Movie: మేజర్‌ సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న 'ఓ ఇషా' రొమాంటిక్‌ సాంగ్‌..
Major
Follow us
Basha Shek

|

Updated on: May 18, 2022 | 9:20 PM

Major Movie: యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం మేజర్ (Major). 26/11 ఉగ్రదాడిలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శశి కిరణ్ తిక్క ఈ సినిమాను తెరకెక్కించారు. మహేష్ బాబు (Mahesh Babu) సొంత బ్యానర్ సంస్థ జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న మేజర్‌ ఏకకాలంలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదలవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మూవీమేకర్స్‌ తాజాగా ఈ చిత్రం నుంచి మరొక అప్డేట్‌ను విడుదల చేసింది.

సెకండ్‌ సింగిల్‌ పేరుతో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఓఇషా అంటూ సాగే ఈ పాటలో హీరో హీరోయిన్లు ఒకరికొకరు పరిచయం, ప్రేమ, పెళ్లి, హీరో సైన్యంలో చేరడం, ఒకరి గురించి ఒకరు ఆలోచించడం వంటి రొమాంటిక్‌ సన్నివేశాలను చూపించారు. ఈపాటలో శేష్, సాయి మంజ్రేకర్ జోడి బ్యూటీఫుల్ అండ్ లవ్లీగా కనిపించారు. ఇక ఈ రొమాంటిక్‌ సాంగ్‌ కు తెలుగులో రాజీవ్‌ భరద్వాజ్‌ సాహిత్యం అందించగా.. అర్మాన్‌ మాలిక్‌, చిన్మయి ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం బాణీలు అందించారు. కాగా మేజర్‌ సినిమాలో తెలుగమ్మాయ శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రలో నటించింది. వీరితో పాటు ప్రకాశ్‌ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

CM Jagan: మెగా పవర్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌.. ప్రపంచంలోనే తొలిసారిగా..

CM KCR AND VIJAY: సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌.. రాజకీయ చర్చకు దారి తీసిన భేటీ!

Rajeev Chandrasekhar: సైబర్‌ సెక్యూరిటీ విషయంలో వెనక్కు తగ్గేదేలే.. త్వరలోనే డేటా ప్రొటెక్షన్‌ బిల్లు అమల్లోకి : కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్