AP Anganwadi Posts: ఏపీలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
AP Anganwadi Posts: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం ఈ విషయమై నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది...
AP Anganwadi Posts: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం ఈ విషయమై నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగ మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో అంగన్వాడీలు టీచర్లు (10), అంగన్‌వాడీ హెల్పర్లు (73), మినీ అంగన్‌వాడీ హెల్పర్లు (3) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళ అభ్యర్థులు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. అలాగే అదే గ్రామానికి చెందిన స్థానిక వివాహిత అయి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను శిశు అభివృద్ధి పథకపు అధికారిణి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* దరఖాస్తుల స్వీరణకు 23-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..